Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం
ABN , Publish Date - Mar 01 , 2024 | 01:45 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవ అప్రూవర్ అభ్యర్థనకు రౌజ్ అవెన్యూ కోర్టు ఓకే చెప్పింది. న్యాయమూర్తి నాగ్ పాల్ ఈ రోజు ఉత్తర్వులు వెలువరించారు. తాజా పరిణామాలతో ఢిల్లీ లిక్కర్ కేసు.. సీబీఐ కేసులో మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారారు. ఈడీ దాఖలు చేసిన కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారారు.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవ అప్రూవర్ అభ్యర్థనకు రౌజ్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ఓకే చెప్పింది. న్యాయమూర్తి నాగ్ పాల్ ఈ రోజు ఉత్తర్వులు వెలువరించారు. తాజా పరిణామాలతో ఢిల్లీ లిక్కర్ కేసు.. సీబీఐ (CBI) కేసులో మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారారు. ఈడీ దాఖలు చేసిన కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulu Reddy) కుమారుడు మాగుంట రాఘవ (Magunta Raghava) నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవ ఉన్నారని ఈడీ (ED) పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.