Ap High Court : ప్రభుత్వ అధికారాలపై స్పష్టత ఇవ్వండి
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:36 AM
వక్ఫ్‌బోర్డు సభ్యులను తొలగించడంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలపై స్పష్టత ఇవ్వాలని అదనపు ఏజీని హైకోర్టు ఆదేశించింది.
వక్ఫ్‌బోర్డు సభ్యుల తొలగింపుపై హైకోర్టు ఆదేశం
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌బోర్డు సభ్యులను తొలగించడంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలపై స్పష్టత ఇవ్వాలని అదనపు ఏజీని హైకోర్టు ఆదేశించింది. వక్ఫ్‌బోర్డు సభ్యులను తొలగించడంతోపాటు కొత్తవారి ని నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం మంగళవారం హైకో ర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఎదుట విచారణకు వచ్చిం ది. వక్ఫ్‌బోర్డు నామినేటెడ్ సభ్యులుగా తమను తొలగించి, కొత్తవారిని నియమిస్తూ ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ సయ్యద్ సఫీ అహ్మద్ ఖాద్రీ మరో ఇద్దరు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. బోర్డు సభ్యులను అర్ధాంతరంగా తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ సాంబశివప్రతాప్ వాదనలు వినిపిస్తూ.. వక్ఫ్‌బోర్డు చట్టం ప్రకారం సభ్యులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. విచారణను న్యాయమూర్తి ఈ నెల 13కి వాయిదా వేశారు.