Share News

AP HighCourt: కోనసీమ జిల్లా అల్లర్లలో కేసులు ఎత్తివేతపై ఏపీ హైకోర్టు అభ్యంతరం

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:09 PM

Andhrapradesh: కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేసులను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను పక్కన పెట్టాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

AP HighCourt: కోనసీమ జిల్లా అల్లర్లలో కేసులు ఎత్తివేతపై ఏపీ హైకోర్టు అభ్యంతరం

అమరావతి, జనవరి 31: కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేసులను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను పక్కన పెట్టాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ స్పష్టం చేసింది. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

కోనసీమ అల్లర్ల నిందితులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిస జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సాధన సమితి కన్వీనర్‌ జంగా బాబురావు ఈ మేరకు హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు. మొత్తం 6 ఎఫ్‌ఐఆర్‌ల కేసుల ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్‌ 20న జీవో జారీ చేసిందని గుర్తు చేస్తూ, దానిని నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. పిటీషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఏకపక్షంగా కేసులు ఉపసంహరిస్తుందని శ్రవణ్ చెప్పారు. హత్యాయత్నం కేసులను ఒక జీవో ద్వారా ఎలా ఉపసంహరిస్తారని శ్రవణ్ ప్రశ్నించారు. వాదనలు విన్న అనంతరం జీవోతో సంబంధం లేకుండా కేసులు ఎత్తివేతపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ ఆదేశించింది. ప్రతి కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని పీపీ, ఏపీపీలను ధర్మాసనం ఆదేశించింది.


పేరు మార్పుపై హింసాకాండ...

కాగా.. ఏపీలో జిల్లాల పునర్విభజన సందర్భాగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు ఆ తరువాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హింసకు దారి తీసింది. అల్లర్లలో భాగంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ఆందోళనకారులు తగులబెట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం... పెద్ద ఎత్తున ఆందోళనకారులపై కేసులు నమోదు చేసింది. ఆ తరువాత రాజకీయ కారణాలు చూపి ఆ కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో కేసుల ఎత్తివేతను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 31 , 2024 | 01:09 PM