Share News

AP News: పుత్తూరు-అత్తిపట్టు హార్బర్‌కు కొత్త రైల్వే లైన్‌..

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:51 PM

పుత్తూరు నుంచి తమిళనాడులోని అత్తిపట్టు కొత్త రైల్వే మార్గం కోసం భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతిచ్చింది. 88 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములను సేకరించాల్సి వుంది.

AP News: పుత్తూరు-అత్తిపట్టు హార్బర్‌కు కొత్త రైల్వే లైన్‌..

- 189 హెక్టార్ల భూసేకరణకు అనుమతి

పుత్తూరు(తిరుపతి): పుత్తూరు నుంచి తమిళనాడులోని అత్తిపట్టు కొత్త రైల్వే మార్గం కోసం భూసేకరణ పనులకు రైల్వే శాఖ అనుమతిచ్చింది. 88 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములను సేకరించాల్సి వుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చెన్నై రైల్వేజోన్‌లో పుత్తూరు-అత్తిపట్టు(Puttur-Atthipattu)తో పాటు 185 కిలోమీటర్ల దిండివనం-తిరువణ్ణామలై, 36కిలోమీటర్ల మోరంపూర్‌-ధర్మపురి,41 కిలోమీటర్ల మన్నార్‌గుడి-పట్టుకోటై, 52 కిలోమీటర్ల తంజావూరు- పట్టుకోటై లైన్ల భూసేకరణకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది.

ఈ వార్తను కూడా చదవండి: ఫైనాన్సర్‌ వేధింపులకు వ్యక్తి బలి..


nani2.jpg

చెన్నై హార్బర్‌లో ఎగుమతులు, దిగుమతుల వత్తిడి ఎక్కువ కావడంతో ప్రత్యామ్నాయంగా అత్తిపట్టు హార్బర్‌ను కేంద్రం ఎంపిక చేసింది. బళ్లారి నుంచి ఎగుమతయ్యే ఇనుప ఖనిజాన్ని భవిష్యత్తులో అత్తిపట్టు హార్బర్‌కు మళ్లిస్తారు. ఈ కొత్త రైల్వే మార్గం నారాయణవనం, పిచ్చాటూరు,నాగలాపురం మండలాల మీదుగా అత్తిపట్ట్టుకు చేరుతుంది. ఈ కొత్త రైలు మార్గం రూపుదాల్చితే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.


ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు

ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2024 | 01:51 PM