Share News

AP News: తుఫాను ఎఫెక్ట్.. రెండు రైళ్ల రద్దు

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:45 PM

దానా తుపాను కారణంగా అనంతపురం(Anantapur) మీదుగా వేళ్లే బెంగళూరు-హౌరా-బెంగళూరు అప్‌ అండ్‌ డౌన్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-భువనేశ్వర్‌ (రైలు నం. 18464)ను ఈ నెల 23న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 18463)ను 24న రద్దు పరచినట్లు తెలియజేశారు.

AP News: తుఫాను ఎఫెక్ట్.. రెండు రైళ్ల రద్దు

గుంతకల్లు(అమరావతి): దానా తుఫాను కారణంగా అనంతపురం(Anantapur) మీదుగా వేళ్లే బెంగళూరు-హౌరా-బెంగళూరు అప్‌ అండ్‌ డౌన్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-భువనేశ్వర్‌ (రైలు నం. 18464)ను ఈ నెల 23న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 18463)ను 24న రద్దు పరచినట్లు తెలియజేశారు.

తిరుపతి ప్యాసింజరు పాక్షిక రద్దు..

జిల్లాలోని రాయదుర్గం-కదిరిదేవరపల్లి(Rayadurgam-Kadiridevarapalli) రైల్వే సెక్షన్‌లో జరుగుతున్న యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా తిరుపతి ప్యాసింజరును పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: AP News: ఈవీఎం ట్యాంపరింగ్ వందశాతం నిజం.. కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు..


తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజరు (నం. 07589) రైలును నవంబరు 1 నుంచి 30 వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07590)ను నవంబరు 2 నుంచి డిసెంబరు 1 వరకూ గుంతకల్లు-కదిరిదేవరపల్లి సెక్షన్‌లో పాక్షికంగా రద్దుపరచి, గుంతకల్లు-తిరుపతి(Guntakallu-Tirupati) సెక్షన్‌లో నడపనున్నట్లు వివరించారు. అలాగే రైల్వే మెయింటెనెన్స్‌ వర్కుల కారణంగా గుత్తి మీదుగా వెళ్లే కాచిగూడ-తిరుపతి (నం. 07063) ప్రత్యేక రైలును ఈ నెల 29, నవంబరు 5, 12 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07064)ను ఈ నెల 30న, నవంబరు 6, 13 తేదీల్లోనూ రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: BRS Leaders : కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రాణహని!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2024 | 01:46 PM