YS Sharmila: మీకొచ్చిన ఇబ్బంది ఏమిటీ సీఎం చంద్రబాబు గారు..
ABN , Publish Date - Dec 21 , 2024 | 02:47 PM
YS Sharmila: మీకొచ్చిన ఇబ్బంది ఏమిటీ సీఎం చంద్రబాబు గారు..
విజయవాడ, డిసెంబర్ 21: మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. అధికారం చేపట్టి.. ఈ ఆరు నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి ఈ పథకం అమలును దాటవేశారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. కొత్త బస్సులు కొంటున్నామంటూ ఇన్నాళ్లూ చెప్పుకొచ్చారని.. కానీ ప్రస్తుతం మంత్రి వర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని ఆమె వివర్శించారు.
Yearender 2024: మోదీకి మళ్లీ కలిసొచ్చిన వేళ..
శనివారం విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకు ? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె సూటిగా నిలదీశారు. చిన్న పథకం అమలకు కొండత కసరత్తు దేని కోసమంటూ ఈ పథకం అమలుపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఈ పథకం అమలు చేసి చూపించారని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గుర్తు చేశారు.
Also Read: అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారన్న విషయాన్ని సైతం వైఎస్ షర్మిల ప్రస్తావించారు. ఈ పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లను కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు చేసుకున్నాయని వివరించారు. జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి మీ ప్రభుత్వం వద్ద నిధులు లేవా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ సందర్భంగా వైఎస్ షర్మిల నిలదీశారు.
Also Read: కువైట్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
మీకు మనస్సు రావడం లేదా?
మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా ? అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఈ పథకం అమలుకు తాము ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంటే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటంటూ సీఎం చంద్రబాబును వైఎస్ షర్మిల నిలదీసే ప్రయత్నం చేశారు. కనీసం నూతన సంవత్సర కానుకగా అయినా.. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూచించారు. ఈ హామీ విషయంలో మీ చిత్తశుద్ది ఏమిటో నిరూపించుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
Also Read: లయోలా కాలేజీ యాజమాన్యంపై మార్నింగ్ వాకర్స్ ఫైర్
ఉచిత ప్రయాణంపై భిన్నాభిప్రాయాలు..
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేశాయంటే.. ఆయా రాష్ట్రాలకు లెక్కకు మిక్కిలిగా ఆదాయం సమకూరుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడంతో.. రాజధాని లేని రాష్ట్రంగా మారింది. మరోవైపు గత జగన్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో కోట్లాది రూపాయిలు వారి ఖాతాల్లోకి కుమ్మరించింది. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయినా.. అప్పు చేసిన నిధులు తీసుకు వచ్చి.. ఆయా పథకాల లబ్ది దారుల బ్యాంక్ ఖాతాలో వేశారు. దీంతో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయింది.
Also Read: భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి
ఒక్కొక్క హామీ అమలు కోసం..
అలాంటి వేళ.. 2024 మే మాసంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకొంటూ వస్తోంది. ఇంకోవైపు అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో నిధులు సమస్యల తీవ్రమవుతోంది. దీంతో కేంద్ర సాయాంతోపాటు ప్రపంచబ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Also Read: భవానీ దీక్ష విరమణలు.. సీపీ కీలక వ్యాఖ్యలు
అలాంటి వేళ.. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తే.. నిధుల సమస్య మరింత తీవ్రమవుతోందనే ఓ అభిప్రాయమైతే సర్వత్ర వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుమార్లు రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. అదీకాక.. కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా.. చోటు చేసుకొంటున్న వరుస పరిణామాలపై ఆర్టీసీ సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
For AndhraPradesh News AND Telugu News