AP SSC Results 2024: పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి
ABN , Publish Date - Apr 22 , 2024 | 11:07 AM
పదో తరగతి పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు (AP Tenth Results) కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఫలితాలను (SSC Results) విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 6లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు.
Gadde Rammohan: విజయవాడ ఈస్ట్‌లో టీడీపీ జెండా ఎగరడం ఖాయం
ముందే ఫలితాలు
ఫలితాలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్
మార్చి 18 నుంచి 30 వరకు 10 పరీక్షలు నిర్వహించాం
పరీక్షలకు 6,16,615 మంది పరీక్షలు రాస్తే..
86.69 శాతం మంది పాస్ అయ్యారు.
మొత్తం 5,34,674 మంది పాస్ అయ్యారు
ఈ సంవత్సరం 10 పరీక్ష లో ఒక్క విద్యార్థి కూడా మల్ప్రాక్టీస్కు పాల్పడలేదు
ఒక ఉపాధ్యాయుని పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు
మొదటి సారి లాస్ట్ వర్కింగ్ డే కన్నా ముందే 10 ఫలితాలు ఇస్తున్నాం
బాలికలదే పైచేయి..!
ఈ సారి ఉత్తీర్ణతలోను బాలికలదే పైచేయి
పది పరీక్ష ఫలితాలు విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యం
ఈ పరీక్ష తరువాతే విద్యార్థి తను చదవాల్సిన స్ట్రీమ్. ఎంచుకుంటారు
45 వేల మంది పరీక్ష లు సిబ్బందిని వాడాము
స్పాట్ వాల్యూషన్ కోసం 25 వేల మంది నీ ఉపయోగించాం
17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి పాస్ కాలేదు
మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా (ఎక్కువ శాతం పాసయిన వారు)
చివరి స్థానంలో కర్నూల్ జిల్లా
ఈసారి పెన్ నంబర్!!
దేశంలో ఉన్న అందరు స్టూడెంట్స్‌కు సంబందించి పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ త్వరలో వస్తారు
భవిష్యత్తులో ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటే పెన్ నంబర్ ద్వారా అన్ని సర్టిఫికెట్లు ఇస్తారు
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పెన్ నంబర్ కూడా ఇస్తారు
ఈ సారి 10 సర్టిఫికెట్లో పెన్ నంబర్ కూడా ఇస్తారు : సురేష్ కుమార్
కాగా.. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పది పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిది వరకూ మూల్యాంకనం నిర్వహించారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాల వేల్యుయేషన్ కోసం 25 వేల మంది టీచర్లను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను నిర్వహించడం జరిగింది. దీంతో 22 రోజుల్లోనే వాల్యుయేషన్ పూర్తి చేసి, ఇవాళ విడుదల చేస్తున్నారు. ఇందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చింది. గతేడాది కంటే.. ముందుగానే ఈసారి ఫలితాలు వచ్చేశాయి.
ఫలితాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
https:// results. bse.ap.gov.in/
ఇవి కూడా చదవండి...
AP Elections: ఆఖరి నిమిషంలో అనూహ్య పరిణామం.. పాడేరు టికెట్ గిడ్డి ఈశ్వరికే ఎందుకు..!?
మరిన్ని ఏపీ వార్తల కోసం..