AP News: పంటలను తిని, తొక్కి నాశనం చేసిన గజరాజులు.. పట్టించుకోని అటవీఅధికారులు
ABN , Publish Date - Apr 22 , 2024 | 10:05 AM
Andhrapradesh: జిల్లాలో గజరాజుల గుంపు మరోసారి వీరంగం సృష్టించాయి. పంటపొలాల్లోకి దూసుకెళ్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులు రాకుండా ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ వాటి దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఏనుగుల బీభత్సాన్ని ఆపే మార్గం లేక.. చేతికి వచ్చిన పంటలను ఎలా కాపాడుకోవాలో తెలీక రైతులు పడుతున్న వేదనలు వర్ణణాతీతం.
చిత్తూరు, ఏప్రిల్ 22: జిల్లాలో గజరాజుల గుంపు మరోసారి వీరంగం సృష్టించాయి. పంటపొలాల్లోకి దూసుకెళ్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులు రాకుండా ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ వాటి దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఏనుగుల బీభత్సాన్ని ఆపే మార్గం లేక.. చేతికి వచ్చిన పంటలను ఎలా కాపాడుకోవాలో తెలీక రైతులు పడుతున్న వేదనలు వర్ణణాతీతం.
Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?
చిత్తూరులో (Chittoor) ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా రామకుప్పం మండలం ఎస్ గొల్లపల్లిలో నాలుగు ఏనుగులు గుంపు హల్‌చల్ చేశాయి. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారిగా దూసుకొచ్చి నాలుగు గజరాజులు.. పంట పొలాలను, బిందు సేద్యం పరికరాలు ధ్వంసం చేశఆయి. పంటలను తిని, తొక్కి నాశనం చేశాయి. రాత్రి వేళలో ఏనుగులు పంటలపై స్వైర విహారం చేస్తున్నప్పటికీ అటవీశాఖ అధికారులు మాత్రం మండిపడుతున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంటలను ఏనుగుల గుంపు ఇలా ధ్వంసం చేస్తుంటే కనీసం నష్ట పరిహారం గానీ, ఏనుగులను పొలాలపై రాకుండా అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకోకపోవడం అన్నదాతుు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
TS News: మద్యం ప్రియులకు ఆరు రోజుల వ్యవధిలోనే మరో షాక్..
Attack On YS Jagan: వైఎస్ జగన్‌పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?
మరిన్ని ఏపీ వార్తల కోసం...