Home » Tenth Results
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(AP Open School Society) జూన్-2024లో నిర్వహించిన పది, ఇంటర్మీడియట్(ఏపీఓఎస్ఎస్) పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలకు 15,058మంది విద్యార్థులు హాజరుకాగా 9,531మంది పాసయ్యారు. 63.30ఉత్తీర్ణత శాతం నమోదైంది.
తెలంగాణలో పది పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త!. మంగళవారం (ఏప్రిల్-30న) నాడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఉదయం 11. 00 గంటలకు పదో తరగతి ఫలితాలు (TS 10th Class Results 2024 ) విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు..
TS 10th Class Results 2024: తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీ అంటే.. రేపు ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పలితాలను ఆంధ్రజ్యోతి. కామ్ వెబ్‌సైట్‌లో క్లిక్ చేసి విద్యార్థులు.. తమ హాట్ టికెట్ ఎంటర్ చేసి.. వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18వ తేదీన 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఏప్రిల్ 2వ తేదీతో ఈ పరీక్షలు ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో రోజులుగా పది పరీక్షలు రాసి వేచి చూస్తున్న విద్యార్థుల కోసం ఫలితాలు వచ్చేశాయ్. అనుకున్నట్లుగానే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్దులు 4, 50, 304 మంది కాగా.. 4,15, 743 మంది(92.32శాతం) ఉత్తీర్ణులైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇక తెలుగు మీడియం 1, 61, 881 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,15, 060 మంది (71.08శాతం) ఉత్తీర్ణత సాధించారు. .
పదో తరగతి పరీక్షల ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు.
పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇవాళ 11 గంటలకు విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేస్తున్నారు. అయితే.. ఈ ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం రండి..