AP Election Counting: ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. రాష్ట్రమంతా మద్యం దుకాణాలు బంద్..
ABN , Publish Date - Jun 03 , 2024 | 12:03 PM
ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ తరువాత ఉదయం 8.30 కి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 350 హాల్స్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు.
అమరావతి: ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ తరువాత ఉదయం 8.30 కి ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 350 హాల్స్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు. ఇవాళ అభ్యర్థుల సమక్షంలో ఆర్వో కార్యాలయాల్లోని అధికారులు స్ట్రాంగ్ రూములు తెరవనున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లలోని పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు తరలించనున్నారు.
మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..
కౌంటింగ్ కేంద్రాల లోపల అవాంతరాలు సృష్టించే వారిని బయటికి పంపించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ డ్రైడే ప్రకటించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు కానుంది. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్.. కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాలు, అభ్యర్థుల నివాసాలు, సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను పెంచడం జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోస్టల్ బ్యాలెట్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ
బానిసత్వాన్ని తెలంగాణ భరించదు:సీఎం
Read Latest AP News and Telugu News