AP Election2024: పత్తిపాడు టీడీపీ ఇన్‌ఛార్జ్ కారుపై దాడి
ABN , Publish Date - Mar 20 , 2024 | 03:42 PM
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు (AP assembly Election 2024) సమీపిస్తున్నా కొద్ది ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఓటమి భయాలు వెంటాడుతున్న ఆ పార్టీ నేతలు భరితెగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని చెబుతున్నవారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటన మరొకటి నమోదయ్యింది.
హైదరాబాద్: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు (AP assembly Election 2024) సమీపిస్తున్నా కొద్ది ఏపీలో వైసీపీ నేతల ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఓటమి భయాలు వెంటాడుతున్న ఆ పార్టీ నేతలు భరితెగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని చెబుతున్నవారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటన మరొకటి నమోదయ్యింది. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రామాంజనేయులు కారుపై దాడి జరిగింది. వలంటీర్లకి గిఫ్టులు పంచుతున్న ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్‌ను అడ్డుకోవడమే ఆయన చేసిన తప్పయ్యింది.
సమాచారం అందుకున్న రామాంజనేయులు.. బాలసాని కిరణ్ ఆఫీస్ దగ్గరకు వెళ్లారు. రామాంజనేయులు కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ దారుణ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వలంటీర్లను నిలువరించడం ఎలా? వైసీపీ కార్యకర్తలను మించి మరీ ప్రచారం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయడం ఎలా? అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నకు మారింది. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే సూచించింది. వారిని ఏజెంట్లుగా కూడా కూర్చోనివ్వొద్దని స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రచారం చేయడమూ కుదరదని తేల్చి చెప్పింది. అయినా సరే... వలంటీర్లు ఎక్కడా ఆగడంలేదు. కరపత్రాలు పట్టుకుని కొందరు, కండువాలు వేసుకుని మరికొందరు, జెండాలు కూడా పట్టుకొని ఇంకొందరు జగన్ భజన చేస్తూనే ఉన్నారు. ఈసీ ఆదేశాల మేరకు వీరిని ఎలా నిలువరించాలో అర్థంకాక అధికారులే తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు... వలంటీర్ల కట్టడికి ఒక మార్గం లభించింది. అదే... ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123, 129, 134ఏ సెక్షన్లతోపాటు ఐపీసీ 171(ఎఫ్) ప్రయోగించడం. ఈ చట్టాల ద్వారా చర్యలు తీసుకోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి