SSC: పది పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్
ABN , Publish Date - Apr 20 , 2024 | 08:26 PM
పదో తరగతి పరీక్ష ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రకటన చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ విడుదల చేస్తారు.
అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాలపై (ssc results) ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రకటన చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించింది. విజయవాడ ఎంజీ రోడ్డులో గల తాజ్ వివంతా హోటల్‌లో పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ విడుదల చేస్తారు. తర్వాత వెబ్ సైట్ https://bse.ap.gov.in/ ద్వారా ఫలితాలను చూడొచ్చు. హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేయగానే ఫలితాలు వస్తాయి. డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం ఉంది. మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 6.3 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. పేపర్ వ్యాల్యూయేషన్ తర్వాత విడుదలకు సంబంధించి ఆటంకం కలిగింది. ఎన్నికల కోడ్ రావడంతో ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. ఫలితాల విడుదలకు ఈసీ అంగీకారం తెలిపింది. దాంతో సోమవారం ఫలితాలు విడుదల చేస్తారు.
CM JAGAN: నేను బచ్చానే.. చంద్రబాబు భయపడ్డారు
మరిన్ని ఏపీ వార్తల కోసం