Tribute to Sitaram Yechury: మంచి మిత్రుడిని కోల్పోయా.. కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి ఏమోషనల్..
ABN , Publish Date - Sep 14 , 2024 | 10:47 AM
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీరని లోటని కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత సుజాన చౌదరి పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కమ్యూనిస్టు భావాలను నమ్ముకుని జీవితమంతా దేశం కోసం కష్టపడ్డారన్నారు. ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించి..
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీరని లోటని కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత సుజాన చౌదరి పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కమ్యూనిస్టు భావాలను నమ్ముకుని జీవితమంతా దేశం కోసం కష్టపడ్డారన్నారు. ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు సుజనా చౌదరి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు ఉన్న అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారన్నారు. ఏచూరి మృతి భారతదేశానికి ఎంతో నష్టమన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిగా సీతారాం ఏచూరితో పెద్దల సభలో సహచరుడిగా ఉన్నానని తెలిపారు. రాజ్యసభలో సీతారాం ఏచూరి మాట్లాడుతుంటే శ్రద్ధగా వినేవాడినని, ఆయన అన్ని విషయాలపై ఎంతో అవగాహన ఉండేదన్నారు. ప్రతి అంశంపై అధ్యయనం చేసేవారి, సభలో ఏమి మాట్లాడాలన్నా ముందుగా ప్రిపేర్ అయ్యేవారన్నారు. ఓ మంచి స్నేహితుడిని, ఒక వ్యక్తిని కోల్పోయామని సుజనాచౌదరి తెలిపారు. ఏచూరి సీతారాం మరణం రాజకీయాలకు అతీతంగా భారతదేశానికి ఎంతో నష్టమన్నారు.
విభిన్నమైన నాయకుడు..
సీతారాం ఏచూరి విభిన్నమైన నాయకుడని సుజనా చౌదరి పేర్కొన్నారు. ఏచూరి తెలుగువారు అయినప్పటికీ అనేక భాషలను మాట్లాడగలరన్నారు. విభిన్నమైన ఒక నాయకుడిని కోల్పోయామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సీపీఎం, సీపీఐ కలవాలి కదా.. రెండు పార్టీలు విభిన్నమైన గళాన్ని వినిపిస్తున్నాయని ఏచూరిని అడిగినప్పుడు.. కొందరు వ్యక్తుల కారణంగా లెప్ట్ పార్టీలు కలవడం సాధ్యం కాలేదని అప్పట్లో సీతారాం చెప్పిన విషయాన్ని సుజనా చౌదరి గుర్తుచేసుకున్నారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి సీతారాం ఏచూరిని కలిసినట్లు తెలిపారు. ఏది ఏమైనా విధిని ఎవరూ తప్పించలేరన్నారు.
ప్రముఖుల నివాళి..
ఢిల్లీ సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కేరళ సీఎం పినరాయి విజయన్, ప్రకాష్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, మాజీ ఎంపీ మధుతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here