AP Elections: ఎన్డీఏలో చేరిన టీడీపీ, జనసేన.. జేపీ నడ్డా అధికారిక ప్రకటన
ABN , Publish Date - Mar 09 , 2024 | 06:37 PM
TDP Joins In NDA: తెలుగుదేశం పార్టీతో (Telugu Desam) పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. మూడ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం పొత్తుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
తెలుగుదేశం పార్టీతో (Telugu Desam) పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. మూడ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం పొత్తుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ-టీడీపీ- జనసేన దేశాభివృద్ధికి కట్టుబడి ఉంటుందన్నారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కృషి చేస్తుందన్నారు.
లెటర్‌లో ఏముంది..?
‘1996లో టీడీపీలో ఎన్డీఏలో జాయిన్ అయ్యింది. సుదీర్ఘకాలం టీడీపీతో కలిసి పనిచేశాం. 2014లో టీడీపీ-బీజేపీ కలిసి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీచేశాం. టీడీపీ పాత మిత్రపక్షమే. ఒకటి రెండ్రోజుల్లో సీట్ల పంపకంపై క్లారిటీ ఇస్తాం’ అని పొత్తులపై బీజేపీ అధికారిక ప్రకటన చేసింది. మరోవైపు.. ఎన్డీఏ ఫ్యామిలీలో చేరాలని చంద్రబాబు, పవన్‌ల నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని జేపీ నడ్డా ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. డైనమిక్, దూరదృష్టి కలిగిన ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభ్యున్నతి కోసం టీడీపీ-జనసేన- బీజేపీ కలిసి పనిచేస్తాయని నడ్డా చెప్పుకొచ్చారు. అధికారిక ప్రకటన రావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. 2014 సీన్ 2024లో రిపీట్ అవుతుందని ఆయా పార్టీ వర్గాలు గట్టిగానే విశ్వసిస్తున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..