Share News

Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..

ABN , Publish Date - Oct 01 , 2024 | 07:35 PM

2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇదే లులు గ్రూప్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. కానీ ఆ ప్రభుత్వ వైఖరితో లులు గ్రూప్ తమిళనాడు, తెలంగాణకు తరలిపోయింది.

Bosta SatyaNarayana: లులు గ్రూప్ ప్రతినిధులు కలిస్తే ఇంత హడావిడా..

విశాఖపట్నం, అక్టోబర్ 01: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో లులు ప్రతినిధులు కలిస్తే.. దానిని పెద్ద హడావిడి చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెట్టిన పెట్టుబడి.. స్థలం విలువలో సగం కూడా లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అందుకే లులు గ్రూప్ విశాఖలో పెట్టుబడులు పెడతామంటే.. గతంలో తమ ప్రభుత్వం అంగీకరించలేదని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ప్రత్యామ్నాయంగా ఇన్ ఆర్బిట్ మాల్ తీసుకు వచ్చామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Also Read: Arvind Kejriwal: అక్టోబర్ 6న జనతా కా అదాలత్


మంగళవారం విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో లులు గ్రూప్‌ సంస్థల పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. ఇక విశాఖ స్లీల్ ప్లాంట్‌లోని కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించడానికి వీలు లేదని ఆయన ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

Also Read: Durga Navaratri 2024: శరన్నవ రాత్రులు.. అమ్మవారి అలంకారాలు.. నైవేద్యం


స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అందుకు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. స్లీట్ ప్లాంట్‌లోని నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: West Bengal: మళ్లీ ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు


అలాగే కార్మికులు డిమాండ్లను సైతం అమలు చేయాలని కోరుతున్నామన్నారు. గతంలో ఎన్నికల వేళ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు.. స్టీల్ ప్లాంట్ కోసం ఏం చెప్పారో.. ఆ మాటకు కట్టుబడి ఉండాలని కోరుతున్నానని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.

Also Read: గోరింటాకు వల్ల ఇన్నీ లాభాలున్నాయా..


20 లక్షల ఉద్యోగాలను ఇస్తామన్నారని.. కానీ నేడు ఉన్న వాళ్ళని తొలగించే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పండగకు పప్పన్నం కాదు చారు అన్నం కూడా తినేటట్లు ఆ ఉద్యోగస్తులు లేరన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లను సైతం తొలగించే ప్రయత్నం జరుగుతుందని ఆయన మండిపడ్డారు.


ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వంలోని పెద్దలను కోరుతున్నానన్నారు. ఈ ప్రభుత్వం తీరు.. ఏరు దాటే వరు ఏటి మల్లన్న.. అ తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉంది చెప్పారు. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తున్నారు సరే.. నిత్యవసర వస్తువుల ధరల పరిస్థితి ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు.

Also Read: Viral News: జూ కీపర్‌పై సింహం దాడి.. ఎలా చేసిందంటే..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాల్లో లులు గ్రూప్ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడితో ఆ గ్రూప్ సంస్థల చైర్మన్ అమరావతిలో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో పేర్కొంది. అయితే 2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇదే లులు గ్రూప్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.


ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. కానీ ఆ ప్రభుత్వ వైఖరితో లులు గ్రూప్ తమిళనాడు, తెలంగాణకు తరలిపోయింది. అయితే ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. దీంతో ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో లులు గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పై విధంగా స్పందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలతోపాటు తెలుగు వార్తలు కోసం..

Updated Date - Oct 01 , 2024 | 07:52 PM