Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Sep 06 , 2024 | 09:21 AM

Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Breaking News: నేటి తాజా వార్తలు..
ABN Andhrajyothy Breaking News

Live News & Update

  • 2024-09-06T21:18:55+05:30

    • ఖైరతాబాద్ గణేశ్

    • హైదరాబాద్: ఉదయం 8 గంటలకు పద్మశాలి సంఘం జంధ్యం, కండువా సమర్పణ

    • 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల తొలి పూజ

    • మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ రాక

  • 2024-09-06T21:01:41+05:30

    • సీఎం రేవంత్ ఎమోషనల్

    • తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభను గుర్తు చేసుకున్న సీఎం రేవంత్

    • తుక్కుగూడ సభ చరిత్రలో అతిపెద్ద ఎన్నికల సమావేశాల్లో ఒకటని పేర్కొన్న రేవంత్

    • బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అబద్ధాలు, కల్పితాలు, వైఫల్యాలను బహిర్గతం చేయగలిగామని సంతృప్తి

    • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగామని రేవంత్ హ్యాపీ

  • 2024-09-06T20:42:21+05:30

    సీఎం రేవంత్ ఎమోషనల్

    • హైదరాబాద్: పీసీసీ చీఫ్ బాధ్యతలపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్

    • చేసిన పనులను గుర్తు చేసుకున్న రేవంత్

    • పదవీకాలాన్ని గుర్తు చేసుకుంటే గర్వంగా ఉంది

    • సహకరించిన పార్టీ నేతలకు, పార్టీ సైనికులకు కృతజ్ఞతలు

    • టీ పీసీసీ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్‌కి అప్పగించడం ఆనందంగా ఉంది

    • నాపై పూర్తి విశ్వాసంతో సోనియా గాంధీ పీసీసీ చీఫ్ చేశారు: రేవంత్

    • పదవీ కాలంలో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి

    • రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రను మరవలేను

    • క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ భారీగా డిజిటల్ మెంబర్‌షిప్ డ్రైవ్‌ చేసింది

  • 2024-09-06T19:55:00+05:30

    • ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

    • సీఎం సహాయనిధికి జీఎంఆర్ గ్రూప్ర్ రూ.2 కోట్ల 50 లక్షలు విరాళం.

    • రూ.కోటి విరాళం అందజేసిన కెమిలాయిడ్స్ కంపెనీ

    • రూ.కోటి విరాళం అందజేసిన శ్రీచైతన్య విద్యాసంస్థలు.

    • రూ.కోటి విరాళంగా అందజేసిన విర్కొ ఫార్మా.

    • రూ.కోటి విరాళంగా అందజేసిన అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి.

  • 2024-09-06T19:31:35+05:30

    రోడ్డెక్కిన విద్యార్థులు

    • బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన

    • ఇంచార్జీ వీసీని తొలగించాలని డిమాండ్

    • వర్షంలో కొనసాగుతోన్న విద్యార్థుల ఆందోళన

  • 2024-09-06T18:20:00+05:30

    సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

    • అమరావతి: వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు

    • ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ నుంచి 7.70 కోట్లు

    • జూమ్ మీటింగ్‌లో నేతలతో అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ సమావేశం

    • సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం

    • త్వరలో సీఎంను కలిసి ఇస్తామన్న ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్

    • ముందుకొచ్చిన పోలీసులు

    • వరద బాధితుల కోసం రూ.12 కోట్ల విరాళం

    • ఒక రోజు బేసిక్ పేను విరాళంగా ఇవ్వనున్న పోలీసు సంఘం

  • 2024-09-06T18:14:54+05:30

    విరాళాల వెల్లువ

    • అమరావతి: సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్న దాతలు

    • సీఎం చంద్రబాబుకు చెక్కులు, నగదు అందించిన పలువురు దాతలు

    • సీఎం సహాయనిధికి రూ.10 కోట్లు విరాళం ఇచ్చిన కాటూరి సుబ్బారావు

    • 5 కోట్లు విరాళం ఇచ్చిన జాస్తి సుధ, వెంకట్ కుటుంబం

    • 2 కోట్లు విరాళం ఇచ్చిన శ్రీచైతన్య, శ్రీకళ్యాణ చక్రవర్తి ఎడ్యుకేషనల్ ట్రస్ట్

    • కోటిన్నర విరాళం ఇచ్చిన విట్ ఛాన్సలర్ డా.విశ్వనాథం

    • కోటి విరాళం ఇచ్చిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు

    • కోటి విరాళం ఇచ్చిన సుజలాన్ అండ్ యాక్సిస్ ఎనర్జీ

    • కోటి విరాళం ఇచ్చిన సీఎం రాజేష్, సీఎం రిత్విక్

  • 2024-09-06T18:12:02+05:30

    • తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్

    • ఢిల్లీ: రెండు రాష్ట్రాలకు రూ.3,300 కోట్ల నిధులు

    • తక్షణ సహాయం కోసం విడుదల చేస్తున్నట్లు వెల్లడి

    • వర్షాలు-వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ, తెలంగాణ

  • 2024-09-06T16:47:05+05:30

    • పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్

    • ఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్

    • మహేశ్ పేరును ప్రకటించిన ఏఐసీసీ

    • బీసీ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పోస్ట్

    • చివరి వరకు రేసులో నిలిచిన మధుయాష్కీ గౌడ్

    mahesh.jpg

  • 2024-09-06T16:03:20+05:30

    తొలి పూజకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు

    • హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడి  తొలి పూజకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు

    • ఉదయం 11 గంటలకు తొలి పూజ

    • ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు

    • మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ హజరు

    • ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు.

    • వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

    • 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా..

    • 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతి: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

  • 2024-09-06T15:53:41+05:30

    • కస్టడీకి ఇవ్వండి

    • గుంటూరు జిల్లా: మాజీ ఎంపీ నందిగం సురేష్‌ కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

    • మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు

    • తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్

    • ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నందిగం సురేష్

      ap police.jpg

  • 2024-09-06T14:54:52+05:30

    సెనైడ్‌తో హత్య

    • గుంటూరు జిల్లా: నాగూర్ బీ అనుమానాస్పద మృతి కేసు చేధించాం: ఎస్పీ సతీష్ కుమార్

    • బ్రీజర్‌లో సెనైడ్ కలిపి ఇవ్వడంతో మహిళ మృతి.

    • మహిళను హత్య చేసినట్టు గుర్తించి దర్యాప్తు చేపట్టాం.

    • హత్య చేయడానికి గోల్డ్ షాపులో వాడే సెనైడ్ ఉపయోగించారు.

    • ఇప్పటివరకు నలుగురిని ఆ విధంగా హత్య చేశారు.

    • మరో ముగ్గురుపై హత్యాయత్నం చేశారు .

    • ఆహారం, డ్రింక్‌లో సెనైడ్ కలిపి నేరాలకు పాల్పడ్డారు.

    • 2022 నుంచి ఈ తరహా నేరాలు చేస్తున్నారు.

    • డబ్బు కోసం, అప్పులు ఎగ్గొట్టేందుకు హత్యలు చేశారు.

    • ముగ్గురు మహిళలను అరెస్టు చేశాం.

    • ముగ్గురిలో ఒకరు గతంలో వాలంటీర్‌గా పని చేశారు.

    • మహిళలకు సైనేడ్ విక్రయిస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశాం

  • 2024-09-06T14:39:03+05:30

    కీలక మలుపు తిరిగిన కోల్‌కత్తా డాక్టర్ కేసు!

    • మరో మలుపు తిరిగిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ ఘటన

    • తొలుత గ్యాంగ్ రేప్ జరిగి ఉండవచ్చనే అనుమానాలు

    • సీబీఐ దర్యాప్తు తర్వాత అభయ హత్యాచారం కేసు ఓ కొలిక్కి!

    • అంతా అనుమానించినట్లు గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ దర్యాప్తులో తేలినట్లు సమాచారం

    cbi.jpg

  • 2024-09-06T14:20:49+05:30

    హైదరాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక..

    • వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

    • రేపటి నుంచి ఈనెల 17 వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

    • ఖైరతాబాద్ గణేష్‌తో పాటు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఆంక్షలు

    • ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచన

    Hyderabad-Traffic.jpg

  • 2024-09-06T14:15:00+05:30

    కాంగ్రెస్‌లోకి వినేశ్, పునియా!

    • హరియాణా అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం

    • కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా

    • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఇవాళ చేరిక

    • రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఫొగాట్

    • ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం

    • సెప్టెంబర్-4న న్యూఢిల్లీలో రాహుల్‌ను కలిసిన ఫొగాట్, బజరంగ్

    • కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని చాలా రోజులుగా ప్రచారం

    • హరియాణాలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత.. అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్

    • ఇందులో భాగంగా జాట్ సామాజిక వర్గం ఓట్లను..

    • తమ వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు

    • ఈ క్రమంలో ఈ ఇద్దరు రెజ్లర్లు పార్టీలోకి రావడం వల్ల..

    • ఆ సామాజిక వర్గం ఓటింగ్ శాతం పెరుగుతుందని కాంగ్రెస్ అంచనాలు

    congress-party.jpg

  • 2024-09-06T14:05:12+05:30

    కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు

    • చాలా కాలం తర్వాత బయటికొచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

    • ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ దంపతులు

    • ఎర్రవెల్లి నివాసంలో వేద పండితులతో..

    • నవగ్రహ యాగం చేపట్టిన గులాబీ బాస్

    KCR.jpg

  • 2024-09-06T14:00:02+05:30

    వైఎస్ జగన్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

    • వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు

    • జగన్ ఇంకా నెగిటివ్ యాటిట్యూడ్‌తో ముందుకు వెళుతున్నారు

    • జగన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం ఉంది కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు దూరం పెట్టారు

    • ఆయన ఎక్కడికెళ్తే అక్కడ రాష్ట్ర ప్రజలకు ప్రమాదం ఉంది..

    • భయపడవలసింది జగన్ కాదు, రాష్ట్ర ప్రజలు

    • గత ఐదేళ్ల జగన్ పాలనకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా..

    • అయినా ఆయన పద్ధతి మార్చుకోలేదు

    • విజయవాడ వరదలపై జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

    • బుడమేరు కాలువకి గేట్లు ఎత్తేసామని.. అమరావతి పూర్తిగా మునిగిపోయిందని అంటున్నారు

    • ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయం చేయాలని ఆలోచన జగన్‌కు రావడం దురదృష్టకరం

    • వరదల్ని రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య

    • విపత్తు పరిస్థితుల్లో గతంలో ఎన్నడు లేని విధంగా..

    • చంద్రబాబు డ్రోన్లు వినియోగించి బాధితులను ఆదుకున్నారు

    • వరదలు వచ్చినప్పుడు మనుషులు చేరుకోలేని..

    • ప్రాంతాల్లో కూడా డ్రోన్లు ద్వారా సహాయం అందించాము

    • ఇంతగా సహాయం చేస్తున్నా జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారు

    • వరద నష్టం అంచనా కార్యక్రమం జరుగుతుంది..

    • జాతీయ విపత్తు అంశంపై కేంద్రంతో మాట్లాడుతున్నాం : రామ్మోహన్ నాయుడు

    rammohan-jagan.jpg

  • 2024-09-06T13:50:02+05:30

    విస్కీ ఐస్ క్రీమ్‌లో కొత్త కోణం

    • సంచలనం సృష్టించిన విస్కీ ఐస్ క్రీమ్‌ వ్యవహారం

    • తవ్వేకొద్దీ బయటపడుతున్న కొత్త కోణాలు

    • సోషల్ మీడియా ద్వారా విస్కీ ఐస్ క్రీమ్ ప్రమోషన్లు, ఆర్డర్లు చేస్తున్న ముఠా

    • వీకెండ్ పార్టీలకు విస్కీ ఐస్ క్రీమ్, విస్కీ చాక్లెట్లు అమ్మకాలు

    • జలాటో విస్కీ ఐస్ క్రీమ్ పేరుతో వీకెండ్ పార్టీలకు పంపుతున్న ముఠా

    • అరికో పార్లల్‌లో 25 బాక్స్‌లు విస్కీ ఐస్ క్రీమ్ సీజ్

    • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు

    • పరారీలో పార్లల్ యజమాని శరత్ చంద్రారెడ్డి

    • ఘటనపై ABN తో ప్రత్యేకంగా మాట్లాడిన ఎక్సైజ్ అధికారి ప్రదీప్ రావు

    • ఐస్ క్రీమ్‌లో 100 pipers విస్కీ కలుపుతూ తయారు చేస్తున్నారు

    • ఐస్ క్రీమ్‌లో ఎలాంటి ఫ్లేవర్ విస్కీతో అయినా ఆర్డర్స్ తయారు చేస్తున్నారు

    • ఫేస్ బుక్‌లో ప్రకటనలు ఇచ్చి విస్కీ ఐస్ క్రీమ్లను తయారు చేస్తున్నారు

    • జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-05, రోడ్ నెంబర్-0 లో..

    • ఏరికో ఐస్ క్రీమ్ పార్లల్లో విస్కీ ఐస్ క్రీమ్లను తయారు చేస్తున్నారు

    • చిన్నపిల్లల సేవిస్తే ప్రమాదం

    • పార్టీ ఆర్డర్ల నిమిత్తం విస్కీ ఐస్ క్రీమ్లను తయారు చేస్తున్నారు

    • ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇచ్చి ప్రమోషన్స్ చేస్తున్నారు : ప్రదీప్ రావు

    Whisky-Ice-Cream.jpg

  • 2024-09-06T13:45:19+05:30

    ప్రతి సందర్బంలోనూ రాజకీయమేనా?

    • బుడమేరు గండి పూడిక పనులను పరిశీలించిన ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి

    • అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి

    • బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి

    • గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బుడమేరుకు గండ్లు

    • ప్రతి సందర్బంలోనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు

    • రూ. 400 కోట్లతో బుడమేకు కట్ట పటిష్టతకు టీడీపీ పనులు ప్రారంభించినా..

    • ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని కొనసాగించ లేదు

    • గత ఐదేళ్ల కాలంలో బుడమేరుకు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలి

    • కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని వరదల్లో ఆదుకుంటోంది

    • నిన్న క్షేత్ర స్థాయిలో కేంద్ర మంత్రి చౌహన్ పర్యటించారు

    • త్వరలో ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేసి సాయం అందిస్తారు : పురంధేశ్వరి

    purandeshwari.jpg

  • 2024-09-06T13:35:46+05:30

    ప్రాణం తీసిన సెల్ఫీ మోజు

    • కామారెడ్డి జిల్లాలో ప్రాణం తీసిన సెల్ఫీ మోజు

    • నాగుపాముతో సెల్ఫీ దిగుతుండగా ఘటన

    • నాగుపాము కాటేయడంతో యువకుడు శివరాజు మృతి

    • బాన్స్‌వాడ మండలం దేశాయిపేట్ పోచారం కాలనీలో ఘటన

    Bhansvada-Snake-Incident.jpg

  • 2024-09-06T13:30:22+05:30

    బుజ్జాయి చేతిలో బొజ్జ గణపయ్య..

    • బుజ్జాయి చేతిలో బొజ్జ గణపయ్య..

    • ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో బుజ్జాయి చేతుల్లో బొజ్జ గణపయ్య

    • శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్‌భవన్‌లో..

    • 'బుజ్జాయి చేతిలో బొజ్జ గణపయ్య' కార్యక్రమం

    • మట్టి గణపతుల తయారీలో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు..

    • పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏటా ఆంధ్రజ్యోతి మట్టి గణపతులు

    • ప్రతి ఏడాది కార్యక్రమం నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి

    Ganapati.jpg

  • 2024-09-06T13:22:41+05:30

    ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వే

    • ఖమ్మం జిల్లా మధిరలో కేంద్రమంత్రుల ఏరియల్ సర్వే

    • మధిర నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని..

    • పరిశీలిస్తున్న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, బండి సంజయ్

  • 2024-09-06T13:20:12+05:30

    డిజియాత్ర సేవలు ప్రారంభం..

    • డిజియాత్ర సేవలు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    • 9 ఎయిర్‌పోర్టుల్లో డిజియాత్ర సేవలు ప్రారంభం

    • 24 ఎయిర్‌పోర్టుల్లో అందుబాటులో డిజియాత్ర సేవలు

    • 3 కోట్ల మంది ప్రయాణికులు డిజియాత్ర సేవలు వినియోగించుకున్నారు..

    • డిజియాత్ర ఒక విప్లవాత్మకమైన మార్పు..

    • ప్రయాణికులు సులభంగా ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించవచ్చు

    • విశాఖ ఎయిర్ పోర్టు నా హోమ్ ఎయిర్ పోర్టు..

    • భవిష్యత్తులో మరిన్ని విమాన సర్వీసులు రాబోతున్నాయి

    • అక్టోబర్ 27న విశాఖ-విజయవాడ విమానం సేవలు

    • విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు కృషి

    • మరో రెండేళ్లలో అందుబాటులోకి భోగాపురం ఎయిర్ పోర్టు

    • విశాఖ ఎయిర్ పోర్టులో కార్గో సేవలు పెంపొందిస్తాం: రామ్మోహన్‌

    Rammohan-Naiduuud.jpg

  • 2024-09-06T13:17:18+05:30

    పెను విధ్వంసం..

    • మేడారం అడవుల్లో పెను విధ్వంసం జరిగిందన్న ఎంపీ ఈటల రాజేందర్

    • లక్షకు పైగా చెట్లు కూలిపోయాయి

    • మేడారం ప్రాంతం ఎడారిగా మారింది

    • ఇలా ఎందుకు జరిగిందో విచారణ జరగాలి: ఈటల

    etela-rajender.jpg

  • 2024-09-06T13:15:58+05:30

    పవన్ సమీక్ష..

    • వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు..

    • పారిశుద్ధ్య పనులపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్ష

    • ప్రజారోగ్య విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలి

    • పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఎక్కడా నీరు నిలవకుండా చూడాలి..

    • వీధుల్లో బ్లీచింగ్‌తో పాటు డ్రైనేజీలు శుభ్రం చేయాలి

    • తాగునీటి సరఫరాలో క్లోరినేషన్ ప్రమాణాలు పాటించాలి: పవన్‌

    Pawan-Kalyan.jpg

  • 2024-09-06T12:50:55+05:30

    రాజ్ తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..

    • సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్-లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్

    • రాజ్ తరుణ్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన హైదరాబాద్ పోలీసులు

    • ఈ వ్యవహారంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన లావణ్య

    • రాజ్ తరుణ్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం శుభ పరిణామం

    • నన్ను ఎన్నో మాటలు అన్నారు.. చివరికి న్యాయం గెలుస్తుందని నేను భావిస్తున్నా

    • రాజ్ తరుణ్‌కు వ్యతిరేకంగా వెళ్లాలని నాకు లేదు

    • నాకు రాజ్ తరుణ్ కావాలి

    • రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మానసికంగా ఎంతో బాధపడ్డా

    • శేఖర్ భాష అనే వ్యక్తిని అస్త్రంగా ఉపయోగించి నాపై ఎన్నో నిందలు వేశారు

    • రాజ్ తరుణ్ శిక్ష అనుభవించాలని నేను కోరుకోను

    • కానీ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను

    • పదేళ్లపాటు కలిసి సంసారం చేశామన్నది వాస్తవం

    • ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చాను

    • హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్ల నన్ను రాజ్ తరుణ్ వదిలించుకోవాలని చూశాడు

    • కేసును తప్పుదోవ పట్టించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు

    • మాల్వి మల్హోత్రా- రాజ్ తరుణ్ ఇద్దరికీ ఎఫైర్ ఉంది

    • వాటికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు ఇచ్చాను : లావణ్య

    Raj-Tarun-And-Lavanya-Case.jpg

  • 2024-09-06T12:45:00+05:30

    సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే..

    • ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

    • బుడమేరు వరద నీరు వెళ్లి కొల్లేరు ముంపునకు..

    • గురి కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని సీఎం నిర్ణయం

    • గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఏరియల్ సర్వేకు వెళ్లనున్న చంద్రబాబు

    Chandrababu-Arial-Survey.jpg

  • 2024-09-06T12:30:43+05:30

    నిత్యావసర సరకులు పంపిణీ‌

    • విజయవాడలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ‌ ప్రారంభం

    • వాహనాలను ప్రారంభించిన మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెంనాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని చిన్ని

    • వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్న నాదెండ్ల మనోహర్

    • 1200 వాహనాల ద్వారా ప్రతి ఇంటికి అందేలా‌ విధంగా ప్లాన్ చేశాం

    • ఈ విపత్తు వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు

    • అందరూ బాధ్యతగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు

    • రేపు పండుగ అయినా పంపిణీ కార్యక్రమం ఉంటుంది

    • అనేక జిల్లాల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చింది

    • నాలుగు రోజుల్లో అందరికీ సరుకులు అందేలా చేస్తాం

    • నీళ్లు ఉన్న ప్రాంతాల్లో తోపుడు బళ్ల ద్వారా సరుకులు లోపలకు తీసుకెళతాం : నాదెండ్ల

    Nadendla.jpg

  • 2024-09-06T11:50:32+05:30

    నిలకడగా సీతారాం ఆరోగ్యం

    • నిలకడగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం

    • ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన విడుదల చేసిన సీపీఎం పార్టీ

    • తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లోని..

    • ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వెల్లడించిన సీపీఎం

    • చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని..

    • ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారికంగా ప్రకటన విడుదల చేసిన సీపీఎం

    sitharam.jpg

  • 2024-09-06T11:45:40+05:30

    వైఎస్ జగన్‌ పాస్‌పోర్ట్ రద్దు..

    • వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి పాస్‌పోర్ట్ కష్టాలు

    • ముఖ్యమంత్రి పదవి పోవడంతో వైఎస్ జగన్ డిప్లోమాట్ పాస్ పోర్ట్ రద్దు

    • చేసేదేమీ లేక జనరల్ పాస్‌పోర్ట్ కోసం కోసం దరఖాస్తు చేసిన వైసీపీ అధినేత

    • 5 సంవత్సరాలు జనరల్ పాస్‌పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశం

    • విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టులో మాజీ సీఎం జగన్‌పై కేసు

    • పాస్‌పోర్టు ఇవ్వాలని విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టులో జగన్ పిటీషన్

    • దీనిపై ఒక సంవత్సరానికి పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆదేశించిన విజయవాడ కోర్టు

    • ఐదు సంవత్సరాలకు పాస్ పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో జగన్ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు

    • పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

    • దీంతో లండన్ ప్రయాణం వాయిదా వేసుకున్న వైఎస్ జగన్

    YS-Jagan-Passport.jpg

  • 2024-09-06T11:27:00+05:30

    వావ్.. బాలయ్య వారసుడొచ్చేశాడు..!

    • వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమైన నందమూరి బాలకృష్ణ తనయుడు

    • టాలీవుడ్‌లోకి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

    • ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు

    • మోక్షజ్ఞను వెండి తెరకు పరిచయం చేస్తున్న స్టార్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ

    • ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు..

    • సందర్భంగా సినిమాలో లుక్‌ రిలీజ్ చేసిన డైరెక్టర్

    Mokshagna.jpg

  • 2024-09-06T11:15:26+05:30

    అలుపెరగని సీఎం!

    • 6వ రోజు వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

    • వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ముఖ్యమంత్రి కి వివరించిన అధికారులు

    • ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్‌ను మరింత వేగవంతం చేయాలన్న సీఎం

    • బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనుల ప్రోగ్రస్‌ను తెలుసుకున్న ముఖ్యమంత్రి

    • గండ్లుపూడ్చి వేత కార్యక్రమంలో రంగంలోకి దిగిన భారత ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం

    • యద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి....ఇప్పటికే రెండు గండ్లు పూడ్చిన అధికారులు

    • అత్యంత క్లిష్టంగా ఉన్న మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో వేగంగా చేస్తున్న ప్రభుత్వం

    • అన్ని విభాగాల సమన్వయంతో మూడో గండి పూడ్చివేత పనులు త్వరగా పూర్తిచెయ్యాలన్న సీఎం

    • కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్దరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు తెలుసుకున్న చంద్రబాబు

    • నిత్యావసరాతో కూడిన 6 వస్తువుల పంపిణీపైనా సమీక్ష చేసిన సీఎం..

    • ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి సరఫరాకు సిద్దం చేసిన అధికారులు

    • వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో..

    • ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్లను పిలిపించాలన్న ముఖ్యమంత్రి

    • అవసరం అయితే కొంత పారితోషికం ఇచ్చి అయినా..

    • మెకానిక్‌లను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాలనుంచి తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు

    Chandrababu-D.jpg

  • 2024-09-06T11:02:01+05:30

    తెలంగాణకు రండి.. సాయం చేయండి!

    • తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం

    • ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్..

    • నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీగా పంట నష్టం

    • వర్షాల కారణంగా 20 మందికి పైగా మృతి

    • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా సహా..

    • నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం

    • తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని..

    • ఈనెల 1న ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం రేవంత్‌

    Modi-And-Revanth-Reddy.jpg

  • 2024-09-06T11:00:08+05:30

    పంట పొలాల పరిశీలన

    • కృష్ణా జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటన

    • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌

    • గన్నవరం మండలం కేసరపల్లిలో బుడమేరు వల్ల నష్టపోయిన..

    • పంట పొలాలను పరిశీలించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్

    • కేంద్రమంత్రి వెంట మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు..

    • ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు

    Shivraj-Singh-Floods.jpg

  • 2024-09-06T10:51:06+05:30

    పోటాపోటీ నిరసన

    • సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటాపోటీ నిరసన

    • మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం..

    • భూమిపూజ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణుల సన్నాహాలు

    • అంతకుముందు అక్కడే మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి..

    • విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించామంటున్న BRS

    • తమ నేతను అవమానించేందుకు కాంగ్రెస్ అదే స్థలంలో..

    • విగ్రహం ఏర్పాటు చేయాలని చూస్తోందంటున్న BRS శ్రేణులు

    • ఇరు పార్టీల మధ్య వాగ్వాదం, పోలీసుల మోహరింపు

    brs congress.jpg

  • 2024-09-06T10:30:36+05:30

    విస్కీ ఐస్ క్రీమ్స్ గుట్టు రట్టు..

    • హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ మత్తుమందు కలకలం

    • పిల్లల ఐస్క్రీమ్లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠా అరెస్ట్

    • వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ అధికారుల సోదాలు

    • ఐస్క్రీమ్లో పేపర్ విస్కీ కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తింపు

    • 60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మి.లీ విస్కీ కలుపుతున్న ముఠా

    • వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్ యజమానులు..

    • దయాకర్ రెడ్డి, శోభన్‌ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు

    Whisky-Ice-Cream.jpg

  • 2024-09-06T10:19:49+05:30

    రంగంలోకి ఆర్మీ..

    • బుడమేరు మూడో గండి పూడ్చేందుకు రంగంలోకి ఆర్మీ

    • గండి పూడ్చేందుకు 40 మంది ఆర్మీ బృందం యత్నం

    • ఇప్పటికే రెండు గండ్లు పూడ్చిన అధికారులు

    • మూడో గండి పూడుస్తున్న ఆర్మీ ఇంజినీర్ల బృందం

    • పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

    • యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి : నిమ్మల

    • ప్రస్తుతం మూడో గండిని పూడుస్తున్న అధికారులు

    • సాయంత్రానికి పూర్తి కానున్న మూడో గండి పూడిక పనులు

    Nimmala-Ramanaidu'.jpg

  • 2024-09-06T10:15:09+05:30

    అప్రమత్తంగా ఉండండి..

    • భద్రాచలం దగ్గర 43.3 అడుగులకు చేరిన నీటిమట్టం

    • ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

    • ధవళేశ్వరం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 10.52 లక్షల క్యూసెక్కులు

    • 6 జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ

    • గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

  • 2024-09-06T10:10:00+05:30

    సాధారణ స్థితికి సింగ్ నగర్!

    • సాధారణ స్థితికి చేరుకుంటున్న విజయవాడ ముంపు ప్రాంతాలు

    • యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం

    • సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ మీదుగా వాహనాలకు పోలీసుల అనుమతి

    • సింగ్‌నగర్‌ నుంచి పైపుల రోడ్‌ వరకు విద్యుత్‌ పునరుద్ధరణ

  • 2024-09-06T10:05:07+05:30

    జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

    • తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి(52) అనారోగ్యంతో మృతి

    • తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి అనంతరం యువ తెలంగాణ పార్టీని స్థాపించిన జిట్టా

    • బీజేపీలో చేరి 2023లో బీఆర్ఎస్‌లో చేరిన జిట్టా

    • భువనగిరి శివారు మగ్గంపల్లి రోడ్డులోని..

    • ఆయన ఫామ్ హౌస్‌లో సాయంత్రం నాలుగు గంటలకు అంతక్రియలు

    Jitta-Balakrishna.jpg

  • 2024-09-06T09:45:19+05:30

    రెండో రోజు పర్యటన

    • తెలుగు రాష్ట్రాల వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండ్రోజులపాటు..

    • కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటన

    • నేడు విజయవాడ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల..

    • రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

    • అనంతరం తెలంగాణలో పర్యటించనున్న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

    • ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో..

    • ఏరియల్ సర్వే నిర్వహించనున్న శివరాజ్ సింగ్ చౌహన్

    • మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటన

    • దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించనున్న శివరాజ్‌సింగ్‌

    • కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో రైతులతో ముఖాముఖి

    • వరద బాధితుల సమస్యలను తెలుసుకోనున్న శివరాజ్‌సింగ్‌

    • సాయంత్రం హైదరాబాద్‌లో మంత్రులు, అధికారులతో..

    • సమావేశం నిర్వహించనున్న కేంద్రమంత్రి

    Shivraj-Singh-Chouhan.jpg

  • 2024-09-06T09:40:05+05:30

    భద్రాచలం ఇలా.. ధవళేశ్వరం అలా!

    • భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

    • ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 42.9 అడుగులు

    • మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

    రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కి పెరుగుతున్న వరద

    • కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

    • 12.3 అడుగులకు చేరిన నీటిమట్టం, 175 గేట్లు ఎత్తివేత

    • బ్యారేజ్ నుంచి 10.55 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

    Badrachalam.jpg

  • 2024-09-06T09:35:53+05:30

    మంజీరా ఉధృతి..

    • మెదక్ జిల్లా ఏడుపాయలలో మంజీరా నది ఉధృతి

    • సింగూర్ ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీరు విడుదల

    • ఏడుపాయలు వనదుర్గామాత అమ్మవారి..

    • పాదాలు తాకుతూ ప్రవహిస్తున్న మంజీరా నది

    • వనదుర్గామాత అమ్మవారి ఆలయం మూసివేత

  • 2024-09-06T09:30:00+05:30

    పోటాపోటీగా..!

    • ఆదిలాబాద్ ఏజెన్సీలో పోటాపోటీగా బంద్‌కు ఇరువర్గాల పిలుపు

    • బంద్‌లు, ఇతర నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని ఎస్పీ

    • ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఇచ్చోడ..

    • సిరికొండ, గుడిహత్నూర్ మండలాల్లో 144 సెక్షన్ అమలు

    • జైనూర్‌లో కొనసాగుతున్న పోలీస్ బందోబస్తు, పికెటింగ్‌ ఏర్పాటు

    • బయటి వ్యక్తులకు అనుమతి నిరాకరణ, ఇంటర్‌నెట్ సేవలు బంద్‌

    • సాధారణ పరిస్థితి నెలకొనేవరకు బందోబస్తు: ఎస్పీ గౌస్‌ ఆలం

  • 2024-09-06T09:25:20+05:30

    సాయంత్రానికి పూర్తి..

    • బుడమేరు మూడో గండిని పూడుస్తున్న అధికారులు

    • పూడిక పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల

    • బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల్లో ఆర్మీ ఇంజినీర్లు

    • ఏపీ ప్రభుత్వం అభ్యర్థనతో రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజినీర్లు

    • సాయంత్రానికి పూర్తి కానున్న మూడో గండి పూడిక పనులు

    budameru-flood.jpg

  • 2024-09-06T09:25:04+05:30

    కేసీఆర్‌కు మరో షాక్!

    • బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు

    • మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో ఈనెల 17న..

    • విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు

    • కేసీఆర్‌ సహా స్మితా సభర్వాల్‌కూ కోర్టు సమన్లు జారీ

    • బ్యారేజీ కుంగిపోవడంతో రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని..

    • ఈ అంశంపై విచారణ చేయాలని కోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తి

    kcr-12.jpg

  • 2024-09-06T09:20:23+05:30

    సూర్యుడొచ్చాడు!

    • భారీ వర్షాలు, వరద నుంచి తేరుకుంటున్న విజయవాడ

    • వారం తర్వాత విజయవాడ వాసులకు సూర్య భగవానుడి దర్శనం

    • గత వారం రోజులుగా వర్షాలు, ముసురు వల్ల కనిపించని సూర్యుడు

    • ఏపీకి తప్పిన వాయుగుండం ముప్పు

    • ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వైపు వాయుగుండం పయనం

    • పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

    • రెండ్రోజుల్లో ఉత్తర ఒడిశా, బెంగాల్‌ వైపు వెళ్లే అవకాశం

    Vijayawada-Sun.jpg

  • 2024-09-06T09:00:27+05:30

    దేవుడా.. మళ్లీనా..!

    • వరదల నుంచి ఇంకా తేరుకోని విజయవాడ

    • మళ్లీ పెరిగిన బుడమేరు వరద

    • ఆందోళన చెందుతున్న బెజవాడ వాసులు

    • రెండు అడుగులు వరకు పెరిగిన నీటి మట్టం

    • నిన్న నివాసాల్లో నీరు వెళ్లడంతో శుభ్రం చేసుకున్న స్థానికులు

    • ఈరోజు మళ్లీ వరద నీరు ఇంట్లోకి రావడంతో ఆవేదనలో ప్రజలు

    • సాయంత్రానికి తగ్గు ముఖం పడుతుందన్న అధికారులు

    Bezawada-Floods-1.jpg

  • 2024-09-06T09:00:21+05:30

    Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరదల పరిస్థితి ఎలా ఉంది..? మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమే ప్రత్యేకంగా ఈ లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..