Share News

Budget 2024: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి రూ. 15 వేల కోట్లు..

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:30 AM

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.

Budget 2024: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి రూ. 15 వేల కోట్లు..
Budget 2024

Union Budget 2024: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందిచనున్నట్లు తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల రూపాయిల నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం చేస్తామన్నారు. అలాగే, పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామరు. రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు.


కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు..

  • ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం.

  • ఏపీకి రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నారు.

  • ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది.

  • అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.

  • ఈ ఏడాది రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్థికసాయాన్ని ఏపీకి ప్రకటించిన కేంద్రం.

  • ఈ సాయం రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని ప్రకటించిన నిర్మలా సీతారామన్.

  • పోలవరం నిర్మాణానికీ హామీ ఇచ్చిన కేంద్రం.

  • వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బడ్జెట్‌లో హామీ ఇచ్చిన నిర్మలా సీతారామన్.

  • పోలవరం ఏపీ జీవనాడిగా పేర్కొన్న నిర్మలా సీతారామన్.

  • ఆహార భద్రతకు కూడా పోలవరం నిర్మాణం ఎంతో అవసరమన్న నిర్మలా సీతారామన్.

  • పారిశ్రామిక కారిడార్‌ల అభివద్ధికి ప్రాజెక్టులను ప్రకటించిన నిర్మలా సీతారామన్.

  • విశాఖ-చెన్నయ్, హైదరాబాద్-బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌లను ప్రకటించిన నిర్మల.

  • ఏపీలో నాలుగు రంగాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం.

  • నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు కేటాయిస్తామన్న నిర్మల సీతారామన్.

  • రాయలసీమ, ప్రకాశం, కోస్తా ఆంధ్రలలో వెనుకబడిన జిల్లాలకు ఆర్ధికసాయం.

  • విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేరుస్తామన్న నిర్మల సీతారామన్.

  • పూర్వోదయ పథకం ద్వారా తూర్పు రాష్ట్రాలైన బీహార్, ఏపీ, జార్ఘండ్, బెంగాల్, ఓరిస్సాలకు ప్రత్యేక ప్రాజెక్టులను ప్రకటించిన నిర్మలా సీతారామన్.


Also Read:

బడ్జెట్‌లో మెరుపులు ఇవే..

ఫైళ్ల దగ్ధంపై సీన్ రీకన్‌స్ట్రక్షన్..

కేసీఆర్‌ వస్తే ప్లాన్ ఏ... రాకపోతే ప్లాన్ బీ..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 23 , 2024 | 11:56 AM