మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:16 AM
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)పై విశాఖ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఎం చంద్రబాబు, లోకేశ్‌పై అసభ్య వ్యాఖ్యలు
విశాఖ పోలీసులకు ఏయూ విద్యార్థిని ఫిర్యాదు
విశాఖపట్నం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)పై విశాఖ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై గతంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అసభ్య పదజాలంతో గతంలో దూషించిన వీడియోలు వైరల్‌గా మారాయి. వీటిపై ఏయూలో న్యాయవిద్య అభ్యసిస్తున్న సత్యాల అంజనాప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలను చూసి, దూషణలను విని ఒక మహిళగా తీవ్ర మనస్తాపం చెందానని, కొడాలి నానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు నానిపై సీఐ రమణయ్య కేసు నమోదు చేశారు.