Share News

Ration Rice Export : విశాఖ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం ఎగుమతి..

ABN , Publish Date - Dec 11 , 2024 | 06:06 AM

విశాఖ పోర్టు నుంచి విదేశాలకు రేషన్‌ బియ్యం ఎగుమతి వ్యవహారంలో రెండు సంస్థలపై అధికారులు కేసులు నమోదుచేశారు.

Ration Rice Export : విశాఖ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం ఎగుమతి..

  • రెండు సంస్థలపై కేసు నమోదు

విశాఖపట్నం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): విశాఖ పోర్టు నుంచి విదేశాలకు రేషన్‌ బియ్యం ఎగుమతి వ్యవహారంలో రెండు సంస్థలపై అధికారులు కేసులు నమోదుచేశారు. సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక తనిఖీల్లో పోర్టు పరిధిలో ఉన్న కంటైనర్లలో 483 టన్నుల రేషన్‌ బియ్యం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. ఇండోర్‌కు చెందిన ఏఎ్‌సజీ ఫుడ్స్‌, కాకినాడకు చెందిన ‘బిబో’ సంస్థపై జిల్లా కలెక్టర్‌ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. అయితే పట్టుబడింది రేషన్‌ బియ్యమేనని డీలర్లు చెబుతున్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.2 కోట్లు ఉంటుందని జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు.

Updated Date - Dec 11 , 2024 | 06:06 AM