Share News

AP politics: భూమి కోసం.., భుక్తి కోసం.., విముక్తి కోసం.. ఓటుకు పోటెత్తండి

ABN , Publish Date - May 12 , 2024 | 03:28 AM

ఐదేళ్ల జగన్‌ పాలనపై తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. సోమవారమే పోలింగ్‌! ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధం కండి! మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్రం బాగు కోసం ఓటేయండి

AP politics: భూమి కోసం.., భుక్తి కోసం..,  విముక్తి కోసం.. ఓటుకు పోటెత్తండి

ఇంకొక్క రోజు! ఒకే ఒక్క రోజు!

ఐదేళ్ల జగన్‌ పాలనపై తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. సోమవారమే పోలింగ్‌! ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధం కండి! మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్రం బాగు కోసం ఓటేయండి! ప్రభుత్వ భూములను తాకట్టుపెట్టి, ప్రజల ఆస్తులను చెరబట్టే పాలనకు తెరదించాలన్నా... ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వక, ప్రైవేటు ఉద్యోగాలు లేక, ఉపాధి కోసం ‘వలస జీవులు’గా మారే దుర్గతి పోవాలన్నా.. నల్ల చట్టాలతో నోళ్లు మూయించి, నోరు తెరిస్తే దాడులు చేసే దౌర్జన్యాల పాలనను సాగనంపేందుకు ఓటేయాలి! సోమవారం ఓటుకు పోటెత్తాలి! అరాచక పాలనపై వేటేయాలి.

  • ‘ఒక్క చాన్స్‌’తో దాడులు,

  • దౌర్జన్యాలు, విధ్వంసాలు

  • ప్రజల ఆస్తుల పరాధీనానికి

  • ఏకంగా చట్టాలు

  • నోరెత్తితే లోపలేసేలా

  • చీకటి జీవోలు

  • పాలనలో పారదర్శకతకు

  • పూర్తిగా సమాధి

  • ప్రభుత్వ ఉద్యోగాల్లేవు..

  • ప్రైవేటు కంపెనీలు రావు

  • ఉపాధి అవకాశాలపై

  • జగన్‌ గొడ్డలి వేటు

  • అరాచకాన్ని అంతం

  • చేసేందుకు ఓటే ఆయుధం

‘పాలించేందుకు కాదు... పగ సాధించేందుకే అధికారం’ అనే సూత్రాన్నే అనుసరించారు. ‘స్టేట్‌ టెర్రరిజం’ అమలు చేశారు. డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేసి విధ్వంసం సృష్టించినా దిక్కులేదు. పుంగనూరులో పెద్దిరెడ్డి అనుచరుల అరాచకాలు అడ్డే లేకుండా సాగుతున్నాయి. పవన్‌కల్యాణ్‌ సభకు స్థలమిచ్చారని ఇప్పటంలో ఇళ్లను కూల్చివేశారు. టెక్కలిలో జనసేన కార్యాలయాలపై దాడులు చేశారు. ఆకలితో అలమటించే నిరుపేదల కడుపునింపే అన్న క్యాంటీన్లపై కన్నెర్ర చేశారు. చెత్త పన్ను చెల్లించకుంటే వేధింపులకు గురిచేశారు. కేవలం చంద్రబాబుపై కక్షతో ‘ప్రజా వేదిక’ను కూల్చివేశారు. అచ్చెన్నాయుడు ఇంటిపై దాడిచేసిన దువ్వాడ శ్రీనివా్‌సకు ఎమ్మెల్సీ పదవి, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్‌కు మంత్రి పదవీ ఇచ్చి ‘గౌరవించారు.’

  • భూమి కోసం..

  • జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతటా ప్రజల ఆస్తులకు భద్రతలేకుండా పోయింది. దౌర్జన్యాలు పెరిగిపోయాయి. కన్ను పడితే కబ్జా చేయడమే!

  • ప్రభుత్వ ఆస్తులు, భూములనూ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. చేసిన అప్పులు కట్టలేక ఆయా ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులే స్వాధీనం చేసుకుని, వేలం వేసే దుస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

  • ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా చేశారు. ప్రజల భూములపై కన్నేశారు. ముందుగా భూములను వివాదాల్లోకి నెట్టడం, ఒరిజినల్‌ పత్రాలు ఇవ్వకపోవడం, ప్రజల ఆస్తుల వివరాలు, వేలిముద్రలు ప్రైవేటు కంపెనీకి మళ్లించడం వంటివి ప్రజలను తీవ్ర అభద్రతా భావంలోకి నెట్టేశాయి.

  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరు చెబితేనే రైతులు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ‘మా భూములు మాకు కాకుండా పోతాయేమో’ అనే ఆందోళన ఏర్పడింది. అప్పుల కోసం ప్రజల ఆస్తులూ తాకట్టు పెడతారేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

  • భుక్తి కోసం..

  • ఆదాయం పెంచలేదు. సంపద సృష్టించలేదు. తన అస్తవ్యస్త నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చెడగొట్టారు. ఈ ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. దీని నుంచి బయటపడి... రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ఓటేయండి.

  • నిర్మాణ కూలీలకు పనుల్లేవు. నిపుణులకు ఉద్యోగాలు లేవు. వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు పోవాల్సిందే! ఉద్యోగాలను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో వెతుక్కోవాల్సిందే. ఇక రాష్ట్రంలో యువతకు దిక్కేదీ?

  • వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు తప్ప జగన్‌ సర్కారు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు దాదాపుగా సున్నా. మెగా కాదు కదా, అసలు డీఎస్సీయే లేదు. జాబ్‌ క్యాలెండర్‌ ఊసేలేదు. సర్కారు మారితేగానీ కొలువులు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.

  • ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు లేవు. రిటైరైన ఉద్యోగులు 15వ తేదీ వచ్చేదాకా పెన్షన్‌ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. రివర్స్‌ పీఆర్సీతో మోసం.. సీపీఎస్‌ రద్దంటూ గద్దెనెక్కి మోసం!

  • రాజధాని లేకుండా చేసి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిన పాలన! అమరావతి పూర్తయితే లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు లభించేవి. ఆ పునర్‌వైభవం సాధించేందుకు ఓటేయాలి.

  • పల్లెల ప్రగతికి, పల్లె జనం భుక్తికి ఉపయోగపడే రూ.12 వేల కోట్ల స్థానిక సంస్థల నిధులను అడ్డగోలుగా మళ్లించిన తీరును ఎండగట్టేందుకు ఓటేయాలి.

  • ప్రభుత్వ విధానాలతో విసిగి రూ.10 వేల కోట్ల విలువైన 16 కియా అనుబంధ పరిశ్రమలు, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన అమర్‌రాజా కంపెనీ విస్తరణ ప్లాంట్లు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయి. జగన్‌ పాలనకు జడిసి పారిపోయిన కంపెనీలు ఎన్నెన్నో! ఇలా యువతకు ఉపాధి దూరం చేసిన ఉన్మాదాన్ని ఓడించాలి.


  • విముక్తి కోసం..

  • ప్రశ్నిస్తే కేసులు.. సామాన్యులు, ప్రతిపక్షాలు, వ్యవస్థలపై దాడులు! బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలపై దౌర్జ్యనాలు! ఈ దాష్టీకాల నుంచి విముక్తి కోసం ఓటేయండి.

  • కూల్చివేతలు, ప్రతీకార చర్యలు, అక్రమ అరెస్టులు, కబ్జాలు, దోపిడీ, బలవంతపు వసూళ్లు, కమీషన్లు! రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధ్వంసం నుంచి విముక్తికి ఓటేయాలి.

  • పాలనలో పారదర్శకతకు పాతరేశారు. తాను తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తెలియకుండా జీవోల వెబ్‌సైట్‌ను ఎత్తేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే రాష్ట్రంలో జీవోఐఆర్‌ సైట్‌ను మూసేశారు. పాలనలో ఈ ఇష్టారాజ్యం నుంచి, గోప్యత నుంచి విముక్తి కోసం ఓటేయాలి.

  • ఎస్సీ, ఎస్టీల్లో ఎవరికీ స్వయంఉపాధి ఉండకూడదని ఆ కార్పొరేషన్లకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నో పోరాటాల తర్వాత వచ్చిన సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేశారు. ఈ నియంతృత్వ పోకడల నుంచి విముక్తి కావాలి.

  • రాయలసీమలో, పల్నాడులో తాగునీటి సమస్యలు వచ్చాయంటే జగన్‌ వల్లే. అన్నమయ్య ప్రాజెక్టును ధ్వంసం చేశారు. పులిచింతల గేటు కూడా సరిచేయలేని అసమర్థత. ఇక.. పోలవరం కట్టేంత చిత్రం ఎక్కడిది? ఈ అసమర్థ పాలన నుంచి విముక్తి కోసం ఓటేయాలి.

  • అడ్డగోలుగా సెస్సులు, ఆస్తిపన్ను, పెట్రో బాదుడు, కరెంటు బిల్లులు... మొత్తంగా బాదుడే బాదుడు నుంచి విముక్తి కావాలి.

  • ప్రాణాలు తీస్తున్న గోతుల రహదారుల నుంచి విముక్తి కోసం ఓటేయాలి.

  • కల్తీ మద్యంతో ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్న ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కావాలి.

  • గవర్నర్‌ పేరు మీదనే నిబంధనలకు వ్యతిరేకంగా అప్పులు చేసే అడ్డగోలుతనం నుంచి విముక్తి కావాలి.

  • శాసనమండలిలో అధికార పార్టీ సభ్యులే చైర్మన్‌పై దాడికి పాల్పడే దౌర్జన్యాలను దండించాలి.

  • జీవో నంబర్‌ 1 తీసుకొచ్చి బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకుండా ‘బ్రిటీష్‌ రాజ్‌’ తరహాలో విధించిన నిర్బంధాన్ని ఛేదించాలి.

  • జీవో నంబర్‌ 2430 తీసుకొచ్చి పత్రికా స్వేచ్ఛకు వేసిన సంకెళ్లను బద్దలు కొట్టేందుకు ఓటేయాలి. విలేకరులపై జరిగే దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఓటు వేయాలి.

  • ప్రభుత్వ కార్యాలయాలకూ పార్టీ రంగులు వేసి వేల కోట్లు తగలబెట్టిన అడ్డగోలు ప్రభుత్వం నుంచి విముక్తికి ఓటేయాలి.

  • ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగినందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేధించారు. జీతాల పెంపు హామీని నిలబెట్టుకోవాలని కోరిన అంగన్‌వాడీ వర్కర్లపై ఎస్మా ప్రయోగించారు. ఈ నియంత తరహా పాలన నుంచి విముక్తి పొందాలి.

  • నాయకుడి లక్షణాలు ఇవేనా?

  • జగన్మోహన్‌ రెడ్డి బాబాయ్‌ వివేకానంద రెడ్డిపై సొంత ఇంట్లో గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రచారం చేశారు. ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ జగన్‌ రోత పత్రికలో రాయించారు.

  • కోడికత్తి దాడిపై రచ్చ చేశారు. అది చంద్రబాబు చేయించారని గత ఎన్నికల ముందు జగన్‌ అబద్ధాలు చెప్పారు.

  • తిరుమల ఆలయానికి చెందిన పింక్‌ డైమండ్‌ చంద్రబాబు ఇంట్లో ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి సహా వైసీపీ నేతలు ఊరూవాడా అసత్యాలు ప్రచారం చేశారు. అసలు తిరుమలలో పింక్‌ డైమండ్‌ అనేదే లేదు.

  • టీడీపీ హయాంలో 37 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించగా, వారిలో 35 మంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారని సాక్షాత్తూ పార్లమెంట్‌ ముందు వైసీపీ నేతలు పచ్చి అబద్ధాలు చెప్పారు.

  • చంద్రబాబు పాలనలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలతో కూడిన పుస్తకాన్ని అచ్చేసి పంచిపెట్టారు. ఒక్క పైసా అవినీతిని కూడా రుజువు చేయలేకపోయారు.

  • విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదని ప్రమాణ స్వీకార సభలో చెప్పిన జగన్‌ ఈ ఐదేళ్లలో 9 సార్లు పెంచారు.

  • మద్య నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. ప్రభుత్వ దుకాణాలు తెరిపించి జే-బ్రాండ్లతో జనం ఇల్లూ.. ఒళ్లూ గుల్ల చేశారు.

6 మాఫియాలు

ఇసుక మాఫియా

ల్యాండ్‌ మాఫియా

మైనింగ్‌ మాఫియా

గంజాయి మాఫియా

లిక్కర్‌ మాఫియా

ఎర్ర చందనం మాఫియా

(వీటి ద్వారా 3 లక్షల కోట్లకుపైగా దోపిడీకి పాల్పడినట్లు అంచనా)

  • ఈ దౌర్జన్యాలు మరిచిపోగలరా?

  • సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజును జ్యుడీషియల్‌ కస్టడీలోనే చిత్రహింసలు పెట్టి, ఎదిరిస్తే సొంత పార్టీ వారైనా వదలబోమనే హెచ్చరికలు పంపారు.

  • ఆపరేషన్‌ చేయించుకున్న ప్రతిపక్షనేత అచ్చెన్నాయుడిపై అక్రమ కేసులు పెట్టి తెల్లవారుజామున ఇంటిపై పడి అరెస్టు చేసి హింసించారు.

  • స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా 48 చోట్ల ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల్ని కిడ్నాప్‌ చేశారు. 118 చోట్ల ప్రత్యుర్థుల ఆస్తులను ధ్వంసం చేశారు. ముగ్గురిని హత్య చేశారు. 48 మందిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. 322 మందిపై అక్రమ కేసులు పెట్టారు.

  • నిందలు, అక్రమ కేసులతో వేధించి శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యకు కారకులయ్యారు.

  • మద్యం రేట్లను పెంచారని ప్రశ్నించినందుకు పుంగనూరులో ఓ దళిత యువకుడిని హత్య చేశారు.

  • ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో దళిత యువకుడు శివప్రసాద్‌కు శిరోముండనం చేశారు.

  • పులివెందులలో ఓ మహిళపై హత్యాచారం చేశారు. ఆమెకు న్యాయం చేయాలని చలో పులివెందులకు పిలుపునిచ్చిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

  • పోలీసులు, వైసీపీ నేతల వేధింపుల వల్ల నంద్యాలలో అబ్దుల్‌ సలాం అనే మైనార్టీ వ్యక్తి నలుగురు

  • కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  • జగన్‌ పాలనలో ఒక్క పల్నాడులోనే 18 మంది హత్యకు గురయ్యారు. పల్నాడులో ప్రతిపక్షనేతల ఇళ్లు,

  • వాహనాలు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి

  • తగులబెట్టారు.

  • జాతీయ చేనేత దినోత్సవం రోజునే కడప జిల్లా ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను హత్య చేశారు.

  • సీఎం జగన్‌ ఇంటి సమీపంలో దళిత యువతి

  • గ్యాంగ్‌రేప్‌ కేసులో ప్రధాన నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు.

  • ప్రతిపక్షాలకు చెందిన సబ్బం హరి, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాస్‌, జూలకంటి బ్రహ్మారెడ్డి, రామచంద్రయాదవ్‌, కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇళ్లను ధ్వంసం చేశారు. గీతం యూనివర్సిటీ నిర్మాణాలను కూల్చారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ ఇంటికి విశాలమైన రోడ్డు వేయడం కోసం వందలాది పేదల ఇళ్లు కూల్చేశారు.

  • గిరిజన మహిళ మంత్రూబాయిని వైసీపీ నేతలు ట్రాక్టర్‌తో తొక్కి చంపించారు.

  • దళిత డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు జగన్‌ అన్ని విధాలా అండగా నిలిచారు.

- అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - May 12 , 2024 | 03:28 AM