Polavaram Project: వైఎస్ జగన్ ఆరోపణల్లో వాస్తవం లేదు: కేంద్రం
ABN , Publish Date - Nov 24 , 2024 | 08:39 PM
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్ నిర్ణయించారు. ఆ క్రమంలో వైఎస్ జగన్ చేసిన విమర్శల నేపథ్యంలో నిజానిజాలు చెప్పాలంటూ.. కేంద్ర ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు.
అమరావతి, నవంబర్ 24: పోలవరం ప్రాజెక్టు అంశంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ఇటీవల పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సీఎం ప్రసంగంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్ నిర్ణయించారు. ఆ క్రమంలో వైఎస్ జగన్ చేసిన విమర్శల నేపథ్యంలో నిజానిజాలు చెప్పాలంటూ.. కేంద్ర ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్ర జలవనరుల శాఖ సమాధానం ఇస్తూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టింది.
Also Read: హైదరాబాద్ వాసులకు డేంజర్ బెల్స్
ప్రోజెక్ట్ ఎత్తు పెంపునకు సంబంధించి 2021లో జగన్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను 2023లో ఆమోదించిందని కేంద్రం పేర్కొంది. ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్లకి మొదటి దశ.. 45.72 మీటర్లకు రెండవ దశ అని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ఆమోదించామని కేంద్ర జలవనరుల శాఖ వివరించింది. అయితే గైడ్ బండ్ కుంగి పోవడంతోపాటు ఇతర మరమ్మతులు చేయాల్సిన బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదేనని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ సంస్థకు రూ.1,500 కోట్లకు కేంద్రం కాంట్రాక్ట్ ఇవ్వగా మరో 9 సప్లిమెంటరీ అగ్రిమెంట్లు ద్వారా ఆ మొత్తం రూ. 2,077 కోట్లకు చేరిందని జలవనరుల శాఖ వెల్లడించింది. ఇక ప్రాజెక్ట్‌కు సంబంధించి గైడ్ బండ్ కుంగడంతోపాటు డయాఫ్రమ్ వాల్ మరమ్మతులపై టెక్నికల్ కమిటీ నియమించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: AP Politics: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు
Also Read: జార్ఖండ్‌లో ఇండియా కూటమి నేతగా ఏకగ్రీవ ఎన్నిక
గత ప్రభుత్వ హయాంలో.. అంటే సీఎం వైఎస్ జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చిందంటే.. చెప్పే నాథుడే లేడు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. జగన్ కేబినెట్‌లో జల వనరుల శాఖ మంతులు అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు ఇద్దరు ఇద్దరే. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా బాధ్యతలు చేపట్టినా.. ఈ ప్రాజెక్ట్‌పై ఏ రోజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించలేదు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందంటే.. స్పష్టమైన ప్రకటన సైతం కనీసం చేయలేక పోయారు. ఇక సాక్షాత్తూ నాటి సీఎం వైఎస్ జగన్ సైతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై దృష్టి సారించ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ పరిస్థితిపై నాటి ప్రభుత్వ పెద్దల్లోనే కాదు.. ప్రజల్లో సైతం ఓ విధమైన అగమ్య గోచరం నెలకొంది.
Also Read: జార్ఖండ్ గవర్నర్‌తో భేటీకానున్న సీఎం హేమంత్ సోరెన్
Also Read: మహారాష్ట్రలో రేపే సీఎం, మంత్రిమండలి ప్రమాణ స్వీకారం..!
ఇక 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వారంలో ఓ రోజు.. సోమవారాన్ని కేటాయించారు. దీంతో సోమవారం పోలవారం అయింది. కానీ 2019లో వైఎస్ జగన్ గద్దెనెక్కడంతో.. ప్రాజెక్ట పరిస్థితే కాదు.. రాష్ట్ర పరిస్థితులు సైతం తలకిందులయ్యాయి.
మరోవైపు 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కోలువు తీరింది. ఆ క్రమంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో వాస్తవ పరిస్థితులను ఆయన సోదాహరణగా వివరించారు. దీంతో వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు.
For AndhraPradesh News And Telugu News