Visakha Steel Plant : విశాఖ ఉక్కుపై సానుకూలంగా కేంద్రం
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:23 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటుపై కేంద్రం సానుకూలంగా ఉంది. కార్మికులు ఆందోళన చెందవద్దు’ అని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అన్నారు.
కార్మికులు ఆందోళన చెందవద్దు: రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘విశాఖపట్నం స్టీల్ ప్లాంటుపై కేంద్రం సానుకూలంగా ఉంది. కార్మికులు ఆందోళన చెందవద్దు’ అని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం అక్కయ్యపాలెంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన రోజ్‌గార్ మేళాలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘ఉక్కు కర్మాగారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై కేంద్రం పరిశీలన చేస్తోంది. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తోంది. 2026 జూన్ నాటికి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి అవుతుంది. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ ప్రయత్నాల వల్లే విశాఖకు టీసీఎస్, గూగుల్‌తో పాటు మళ్లీ లూలు వచ్చింది’ అని అన్నారు. సమావేశంలో ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, విశాఖ పోర్టు సెక్రటరీ వేణుగోపాల్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.