AP News: ఆ అధికారిపై సీఈఓ చర్యలు.. కారణమిదే..?
ABN , Publish Date - Mar 17 , 2024 | 04:21 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీలతో అంటకాగుతున్న అధికారులపై సీఈసీ ముకేష్ కుమార్ మీనా (CEO Mukesh Mumar Meena) చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలకు సహకరించిన అధికారులపై వేటు వేసేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ కూడా నిన్నటి నుంచి అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీలతో అంటకాగుతున్న అధికారులపై సీఈసీ ముకేష్ కుమార్ మీనా (CEO Mukesh Mumar Meena) చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలకు సహకరించిన అధికారులపై వేటు వేసేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కొత్తూరు మండలం, దిమిలి గ్రామంలో గ్రేడ్ వన్ వీఆర్వోగా పనిచేస్తున్న కే. రమేష్ రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు కొత్తూరు తహసీల్దార్ సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఓ పార్టీ క్యాన్వసింగ్‌లో రమేష్ పాల్గొన్నట్టు నిర్ధారించారు. తర్వాత రోజు ఓ పత్రికలో సైతం ఈ విషయంపై వార్తా కథనాలు రావడంతో చర్యలకు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమోన్ ఉపక్రమించారు. అభియోగాలు, ఆధారాలు పరిశీలించి రమేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ ప్రోసీడింగ్స్ జారీచేశారు. రమేష్‌పై క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యేవరకూ హెడ్ క్వార్టర్‌ను వదిలి వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశించారు.