Chandrababu: ఏడు ప్రభుత్వ శాఖల స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన చంద్రబాబు
ABN , Publish Date - Jun 28 , 2024 | 09:00 AM
ఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు పోలవరంపై తొలి వైట్ పేపర్ ను విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.
అమరావతి: ఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు పోలవరంపై తొలి వైట్ పేపర్ ను విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో వైట్ పేపర్ విడుదలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ శాఖలపై రివ్యూలకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాల ప్రణాళికపై చర్చించనున్నారు. 4 గంటలకు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.