Share News

Chandrababu: ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన చంద్రబాబు

ABN , Publish Date - Jun 13 , 2024 | 11:26 AM

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో సీఎం చంద్రబాబు మార్పు చూపించారు. మాజీ సీఎం జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయవద్దని ఆదేశించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాలకు అప్పటి ప్రభుత్వం పార్టీ రంగులు వేయించింది.

 Chandrababu: ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో చంద్రబాబు.. తనదైన మార్క్ చూపించారు. ఎక్కడా పంతాలు, పట్టింపులకు పోకుండా గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కంటిన్యూ చేయడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయవద్దని ఆదేశించారు. కాగా.. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాలకు అప్పటి ప్రభుత్వం పార్టీ రంగులు వేయించి నానా హడావుడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చివరకి చంద్రబాబు పేరుతో ఉన్న శిలాఫలకాలను కూడా ధ్వంసం చేయించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.


Chandrababu-Naidu-Ane-Nenu.jpg

జగన్ బొమ్మ ఉన్నా సరే..!

అయితే.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మార్పు అనేది ఎలా ఉంటుందో చేసి చూపించారు. కక్షలు, కార్పణ్యాల జోలికి వెళ్లకుండా.. విద్యార్థులకు స్కూల్స్ పున ప్రారంభం రోజునే విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ... జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్‌ను అలాగే పంపిణీ చేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారు అని టీడీపీ అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించింది. ప్రజాధనం వృథా కాకూడదని.. పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Updated Date - Jun 13 , 2024 | 12:35 PM