Share News

Chandrababu: ప్రక్షాళన ప్రారంభించిన చంద్రబాబు.. సీఎస్, డీజీపీలతో భేటీ

ABN , Publish Date - Jun 15 , 2024 | 01:14 PM

పరిపాలనలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. సీఎస్, డీజీపీలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే ఏపీ సీఎంఓ సిద్ధం చేసింది.

Chandrababu: ప్రక్షాళన ప్రారంభించిన చంద్రబాబు.. సీఎస్, డీజీపీలతో భేటీ

అమరావతి: పరిపాలనలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. సీఎస్, డీజీపీలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే ఏపీ సీఎంఓ సిద్ధం చేసింది. సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇవ్వనున్నారు. వైసీపీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టనున్నారు. ఐఏఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, శశి భూషణ్, అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాల కృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారని చర్చ జరుగుతోంది.


సీనియర్ ఐపీఎస్‌లు రాజేంద్రనాధ్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్. సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. 5 హామీలపై అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. టీటీడీ ప్రక్షాళనతో చంద్రబాబు పని మొదలు పెట్టారు. ధర్మారెడ్డిని తప్పించి.. ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Jun 15 , 2024 | 01:14 PM