Share News

Free Sand Policy: గుడ్ న్యూస్.. ఏపీలో ఇకపై ఉచితంగా ఇసుక..

ABN , Publish Date - Jul 03 , 2024 | 05:35 PM

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ర్ట్ంలో ఉచితంగా ఇసుక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) వెల్లడించారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ(Sand Policy) అమలు కానుందని, దీని వల్ల రాష్ట్రంలో ఎంతోమందికి ఉపాధి అవకాశాలూ దొరుకుతాయని మంత్రి చెప్పుకొచ్చారు.

Free Sand Policy: గుడ్ న్యూస్.. ఏపీలో ఇకపై ఉచితంగా ఇసుక..

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ట్రంలో ఉచితంగా ఇసుక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వెల్లడించారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ(New Sand Policy) అమలు కానుందని, దీని వల్ల రాష్ట్రంలో ఎంతోమందికి ఉపాధి అవకాశాలూ దొరుకుతాయని మంత్రి చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.." నూతన పాలసీ ప్రకారం నిర్మాణాలకు కావలసినంత ఇసుకను రీచుల్లో ఉచితంగా తీసుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వం 5నెలలపాటు సామాన్యులకు ఇసుక దొరకకుండా చేసింది. శాండ్‌పై 40 రంగాలకు పైగా ఆధారపడి ఉంటాయి. అది దొరకకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం చివరికి ప్రజల్ని యాచించే స్థితికి తెచ్చింది. జేపీ సంస్థకు తర్వాత ప్రతిమ, జీసీకేసీ సంస్థలకు తవ్వే కాంట్రాక్టులు అప్పగించారు. కొన్ని పర్మిషన్ల గడువు ముగిసిపోయినా వారు తవ్వకాలు మాత్రం ఆపలేదు. రాష్ట్రంలో 3నెలలకు కోటి టన్నులు అవసరం అవుతాయి. ఇకపై ఇసుక లోటు అనే పరిస్థితి లేకుండా చూస్తాం. అక్రమ రవాణాపై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా శాండ్‌ను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తాం" అని మంత్రి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

T.G. Bharath: అశోక్ లేలాండ్ కంపెనీ పారిపోయే పరిస్థితి తెచ్చారు: మంత్రి టీడీ భరత్

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలు చేసిన రెండు నామినేషన్లకు ఈసీ ఆమోదం..

Updated Date - Jul 03 , 2024 | 05:42 PM