Share News

IAS officer: ఐఏఎఎస్‌ అధికారికి కూటమి నేత దబాయింపు

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:47 AM

జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లూ అధికారుల మీద దబాయింపు పాలన చూసిన కొందరు కూటమి నేతలు, మేం మాత్రం తక్కువా అన్నట్టుగా అదే మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.

IAS officer: ఐఏఎఎస్‌ అధికారికి కూటమి నేత దబాయింపు

తిరుపతి, ఆంధ్రజ్యోతి: జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లూ అధికారుల మీద దబాయింపు పాలన చూసిన కొందరు కూటమి నేతలు, మేం మాత్రం తక్కువా అన్నట్టుగా అదే మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి నగరంలోని ఒక పార్టీ నాయకుడు ఏకంగా ఐఏఎస్‌ అధికారి అయిన కార్పొరేషన్‌ కమిషనర్‌నే దబాయిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్ట్‌ వర్క్‌లు ఇవ్వండని అడగడమే గాక, తాను చెప్పిన వారిని బదిలీ చేయాలంటూ అడిగినట్లు తెలిసింది. అంతటితో సరిపెట్టుకోకుండా ‘నాకు కార్పొరేషన్‌ ఆఫీ్‌సలో ఛాంబర్‌ ఏర్పాటు చేయండి’ అని కూడా ఆదేశించారని తెలియడంతో అందరూ నివ్వెర పోయినట్లు సమాచారం. పార్టీ నాయకులకు ఛాంబర్లు ఇవ్వడం కుదరదని అధికారి స్పష్టం చేయడంతో, చిర్రెత్తిపోయిన ఆ నాయకుడు ఆమె మీద ఇటీవల తిరుపతికి వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రికి ఫిర్యాదు చేశారు. అ ఆధికారి పెళ్లికి అప్పట్లో జగన్మోహన్‌ రెడ్డి హాజరైన ఫొటోలను మంత్రికి చూపించి, ఆమె మన పార్టీకి వ్యతిరేకం అంటూ ఆమెను బదిలీ చేసేయాలని కూడా కోరడం విశేషం.


జగన్‌ ప్రభుత్వంలో కొందరు కమిషనర్లు వైసీపీ నాయకులకు అయ్యాఎస్‌ ల్లా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. ప్రస్తుత తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఎన్‌.మౌర్య మాత్రం ఐఏఎస్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారన్న పేరుంది. తాము అడిగే గొంతెమ్మ కోర్కెలన్నింటినీ తీర్చకపోవడంతో కొందరు నాయకులు ఉడికిపోతున్నారు.

Updated Date - Nov 02 , 2024 | 01:47 AM