Share News

Collector: కలెక్టర్ల సదస్సు

ABN , Publish Date - Dec 11 , 2024 | 01:01 AM

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బయల్దేరి వెళ్లారు.

Collector: కలెక్టర్ల సదస్సు
అధికారులతో నోట్స్‌ తయారీపై చర్చిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

చిత్తూరు/చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధ, గురువారాల్లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బయల్దేరి వెళ్లారు. అంతకుముందు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో నోట్స్‌ తయారీపై చర్చించారు.ఆర్టీజీఎస్‌, గ్రీవెన్స్‌, సచివాలయాలు, వాట్సప్‌ గవర్నెన్స్‌, వ్యవసాయ అనుబంధ రంగాలు, జలవనరుల శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిపారుదల,సెర్ఫ్‌, పట్టణాభివృద్ధి, శాంతి భద్రతల గురించి జిల్లాస్థాయిలో తయారు చేసిన నోట్స్‌ తీసుకువెళ్లారు. అలాగే పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, విద్యుత్‌, మానవ వనరుల అభివృద్ది, రహదారులు, భవనాలు, గృహ నిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ, ఐసీడీఎస్‌, రెవెన్యూ, మైన్స్‌. జిల్లాస్థాయి అభివృద్ధి ప్రణాళిక అంశాలపై జరగనున్న చర్చకు సంబంధించిన నోట్స్‌ను కలెక్టర్‌ తీసుకెళ్లారు.వీటిలో ముఖ్యమైనవి....

జిల్లాలో 152,868మంది డేటా మిస్సయినట్లు గుర్తించగా.. సచివాలయ ఉద్యోగులు జనవరి ఆఖరుకల్లా వారిని గుర్తించాల్సి ఉంది. ఇప్పటివరకు 9289మంది వివరాలను గుర్తించారు. ఇంకా 143579 మందికి చెందిన వివరాలను గుర్తించాల్సి ఉంది. 214,937 మంది బ్యాంకు ఖాతాలు ఎన్‌పీసీఐతో లింక్‌ అవ్వాల్సి ఉండగా.. ప్రత్యేక శిబిరాలను నిర్వహించి ఇప్పటివరకు 98.48 శాతం, అంటే 211,680 మంది ఖాతాలను లింక్‌ చేశారు. ఈ నెల 15లోగా లింకింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. 592,343 గృహాలకు గానూ 95.77 శాతం, అంటే 567,307 గృహాలను జియో ట్యాగింగ్‌ చేశారు. మిగిలిన ప్రక్రియ ఈ నెల 15లోగా పూర్తి చేయాల్సి ఉంది. 27,859 మంది ఆరేళ్లలోపు పిల్లలకు ఆధార్‌ కార్డులు లేవని గుర్తించగా.. 3656 మంది ఎన్‌రోల్‌ చేసుకున్నారు.


ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కింద రబీ పంటల్ని ఎన్‌రోల్‌ చేయడానికి జిల్లాలో 9432 హెక్టార్లను గుర్తించారు. 9వ తేదీ నాటికి వీటిలో 71 హెక్టార్లను మాత్రమే ఎన్‌రోల్‌ చేశారు. 37 అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీలకుగానూ (ప్యాక్స్‌) 2 చోట్ల మాత్రమే పూర్తి స్థాయిలో రికార్డుల్ని ఆన్‌లైన్‌ చేశారు. 2041 గోకులం షెడ్లను మంజూరు చేయగా.. 1824 నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 153 పూర్తయ్యాయి. అలాగే 1356 కిలోమీటర్ల సీసీ రోడ్లకుగానూ 421 రోడ్లు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సారానికి రూ.201 కోట్ల ఉపాధిహామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ వాడాల్సి ఉండగా.. రూ.81.73 కోట్లు మాత్రమే ఉపయోగించారు.

Updated Date - Dec 11 , 2024 | 01:01 AM