Congress: ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి: చింతా మోహన్
ABN , Publish Date - May 19 , 2024 | 02:01 PM
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ రూ. 4 వేల నుంచి రూ. 5 వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టిందని, ఇన్ని కోట్ల డబ్బులు వైసీపీకి ఎక్కడ నుంచి వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో వైసీపీ (YCP) రూ. 4 వేల నుంచి రూ. 5 వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టిందని, ఇన్ని కోట్ల డబ్బులు వైసీపీకి ఎక్కడ నుంచి వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leaer), మాజీ ఎంపీ చింతా మోహన్ (Chinta Mohan) ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి (Tirupati) అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థి రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారని, గూడూరు వైసీపీ అభ్యర్థి రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. వైసీపీకి పోలీసులు అండగా నిలిచారని ఆరోపించారు. పోలీసులు దొంగలను పట్టుకోవాలి కానీ వాళ్లే దొంగలకి సహాయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
వైసీపీ నేతలు తామే అధికారంలోకి వస్తున్నామని ధైర్యంగా చెబుతున్నారని, అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని చింతా మోహన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఓడిపోవడం ఖాయమన్నారు. నరేంద్రమోదీ (PM Modi) పతనం ప్రారంభమైందని.. బీజేపీకి 150 కంటే ఎక్కువ సీట్లు రావని జోష్యం చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు కేంద్ర మంత్రులు అనే చర్చ కూడా ప్రారంభమైందని, జగన్మోహన్ రెడ్డికి పడాల్సిన ఓట్లన్నీ చంద్రబాబు నాయుడుకు పడ్డాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని చింతా మోహన్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..
కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..
ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News