AP NEWS: తిరుపతి జూపార్క్‌లో దారుణం.. వ్యక్తిని చంపేసిన సింహం
ABN , Publish Date - Feb 15 , 2024 | 05:02 PM
తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో విషాదం జరిగింది. జూపార్క్‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దూకాడు. అక్కడే ఉన్న సింహం అతడిపై దాడి చేసి చంపేసింది. అనంతరం ఆ వ్యక్తి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసింది.
తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో విషాదం జరిగింది. జూపార్క్‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దూకాడు. అక్కడే ఉన్న సింహం అతడిపై దాడి చేసి చంపేసింది. అనంతరం ఆ వ్యక్తి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసింది. దాడి చేసిన సింహన్ని జంతు ప్రదర్శన శాల అధికారులు బోనులో బంధించారు.
మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుజ్జర్(34)గా గుర్తించారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా... లేదా ఆ వ్యక్తి కావాలనే సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి దూకాడా అనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో జూపార్క్‌కు వచ్చిన సందర్శకులు, అక్కడ పనిచేసే వారు భయపడిపోతున్నారు. జూ పార్క్ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దొంగల పూర్ అనే సింహం ఆ వ్యక్తిపై దాడి చేసింది.. జూ అధికారులు
తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో సింహం దాడిలో సందర్శకుడు ప్రహ్లాద గుజ్జర్ చనిపోయాడు. అయితే జూ అధికారులు ఈ ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించారు. సింహం బోనులోకి ప్రహ్లాద గుజ్జర్ అనే సందర్శకుడు దూకేశాడని.. బోనులో ఉన్నటువంటి దొంగల పూర్ అనే మగ సింహం దాడి చేసిందని తెలిపారు. అతని ఒంటిపై ఉన్న ప్యాంటు షర్టును లాగేసి మెడ బాగాన సింహం దాడి చేసిందన్నారు.
సింహం ఎన్‌క్లోజర్ గేటును దాటి లోనికి వెళ్లడంతో దాడి చేసిందని చెప్పారు. ప్రతిరోజు సందర్శకులు సింహాలను చూడటానికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సెక్యూరిటీ బోనులో ఉంచుతామని చెప్పారు. సుందరి, కుమార్, దొంగలపూర్ అను రెండు మగ సింహాలు, ఒక ఆడ సింహం ప్రస్తుతం జూలో ఉన్నాయని అన్నారు. దొంగల పూర్ అనే మగసింహం బోనులోనికి ఆ వ్యక్తి దూకడంతో చంపేసిందని జూ అధికారులు తెలిపారు.