Share News

TG Bharath: శ్రీవారిని దర్శించుకున్న మంత్రి టీజీ భరత్

ABN , Publish Date - Aug 20 , 2024 | 01:45 PM

Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడిని మంత్రి టీజీ భరత్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద బ్రాండ్ అని అన్నారు. రాష్ట్రానికి పెద్ద..పెద్ద.. పరిశ్రమలు వస్తాయని నమ్మకం ఉందన్నారు.

TG Bharath: శ్రీవారిని దర్శించుకున్న మంత్రి టీజీ భరత్
Minister TG Bharath

తిరుమల, ఆగస్టు 20: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) వెంకటేశ్వరుడిని మంత్రి టీజీ భరత్ (Minister TG Bharath) మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే (CM Chandrababu Naidu) పెద్ద బ్రాండ్ అని అన్నారు. రాష్ట్రానికి పెద్ద..పెద్ద.. పరిశ్రమలు వస్తాయని నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు.

MLC Kavitha: కవితకు మళ్లీ షాక్.. బెయిల్ విషయంలో పదే పదే నిరాశ..


చాలా మంది పారిశ్రామిక వేత్తలు చంద్రబాబుని కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అడిగినవని కేంద్రం వెంటనే మంజూరు చెయ్యాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ (Kurnool Highcourt Bench) ఏర్పాటు అవుతుందని వెల్లడించారు. అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి భరత్ స్పష్టం చేశారు.


తిరుమలకు భక్తజనం...

మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న (సోమవారం) శ్రీవారిని 71595 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 28981 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.89 కోట్లు ఆదాయం వచ్చింది.


ఇవి కూడా చదవండి..

Gottipati: ఆ ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు

AP News: అనకాపల్లి ఫుడ్ పాయిజన్‌పై పాస్టర్ భార్య సమాధానం ఇదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2024 | 01:48 PM