Share News

Bhuvaneshwari: కుప్పంలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటన..

ABN , Publish Date - Dec 20 , 2024 | 08:19 AM

కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి రెండో రోజు శుక్రవారం పర్యటన కొనసాగుతోంది. ఆమె బస చేసిన పిఎస్ మెడికల్ కాలేజీ ఆవరణంలో ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భువనేశ్వరి అన్నారు.

Bhuvaneshwari: కుప్పంలో రెండో రోజు నారా భువనేశ్వరి  పర్యటన..
Nara Bhuvaneswari

చిత్తూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) చిత్తూరు జిల్లాలోని కుప్పం (Kuppam)లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆమె పర్యటన కొనసాగుతోంది. భువనేశ్వరి బస చేస్తున్న పిఎస్ మెడికల్ కాలేజీ ఆవరణంలో ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత కుప్పం మండలం వెంగాటుపల్లి గ్రామంలో ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 1:45 గంటల వరకు అడవి బూదుగూరు గ్రామంలో మహిళలతో ముఖాముఖి మాట్లాడతారు. 2.30 గంటల నుంచి 4 గంటల వరకు గుండ్ల మడుగు గ్రామంలో మహిళలతో చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని డీకే పల్లిలో మహిళలతో ముచ్చటిస్తారు.


మహిళలకు ఆర్థిక చేయూత..భువనేశ్వరి

కాగా అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని భువనేశ్వరి అన్నారు. గురువారం కుప్పంలో ఆమె పర్యటించారు. ఈ సందర్బంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అదనపు కోర్సులను ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున మహిళలకు ఆర్థిక చూయూత అందిస్తామని తెలిపారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో త్వరలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు.

భువనేశ్వరి కుప్పంలోని ప్రతీ మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు. ఆపై సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోనున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. ఆదివారం మధ్యాహ్నం పర్యటనను ముగించుకుని తిరిగి అమరావతికి భువనేశ్వరి చేరుకోనున్నారు. కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాటు చేశారు.


అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబుతో కలిసి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో రెండు సార్లు పర్యటించారు. కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామానికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే చర్యల్లో భాగంగా కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

రాజధాని అమరావతికి శుభారంభం..

సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..

ఏపీలో వర్షాలపై కీలక అప్‌డేట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 20 , 2024 | 08:19 AM