High Tension: పుంగనూరులో ఉద్రిక్తత.. మిథున్ రెడ్డి హౌస్ అరెస్టు..
ABN , Publish Date - Jun 30 , 2024 | 01:57 PM
చిత్తూరు జిల్లా: పుంగనూరులో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ధర్నాకు చేపట్టారు. పుంగనూరు, అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
చిత్తూరు జిల్లా: పుంగనూరులో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) పుంగనూరు (Punganur) పర్యటన నేపథ్యంలో టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన నేతలు (Janasena Leaders) ధర్నాకు చేపట్టారు. పుంగనూరు, అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. ‘మిథున్ రెడ్డి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఐదేళ్లూ పుంగనూరులో పర్యటిస్తే ఉపేక్షించేదిలేదని కూటమి నాయకులు హెచ్చరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఎంపీని పర్యటనకు వెళ్లవద్దని చెప్పారు. ఆయన వినకపోవడంతో తిరుపతిలో హౌస్ అరెస్టు చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
అంతకుముందు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ (Assembly), రాజంపేట పార్లమెంట్ (Rajam Pet Parliament) పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ నేతలు (TDP Leaders) పాల్పడుతున్నారని, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని, పుంగనూరులో ఎప్పుడు లేని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారని విమర్శించారు. జేసీబీలు తెచ్చి పేదల ఇల్లు కులదోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమన్నారు.
ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఈరోజు పుంగనూరులో ఉందని, తమ వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, నియోజకవర్గంలో తనను పర్యటించకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయం స్పీకర్ దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. తమకు ఓటు వేసిన 40 శాతం మందిని రాష్ట్రం నుంచి తరిమేస్తారా ? అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మేము అండగా ఉంటామని, పార్టీ మారమని తమ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిడి చేసి, ప్రలోభాలు చేయడం ద్వారా పార్టీలు మార్పిస్తే లాభం లేదన్నారు.
తాను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని, చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్న.. ఇలాంటివి ఎప్పుడు లేవని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని చల్లా బాబుకు సలహా ఇస్తున్నానన్నారు. పోలీసులపై దాడి చేసి చల్లా బాబు జైలుకు వెళ్ళారని, తాను అరెస్టుకైనా, ప్రణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పస్టం చేశారు. మంత్రి పదవి భద్రపరుచుకోవడం కోసం రాం ప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అలాంటి వారికి త్వరలో రూ.15 వేల పింఛన్
సీఎం ఎవరిపై ప్రేమ చూపిస్తున్నారో అర్థమౌతోంది
చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు..: ఎంపీ మిథున్ రెడ్డి
నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..
ఏపీలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News