TTD: తిరుమల అన్న ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 05 , 2024 | 02:00 PM
తిరుమల: కలియుగ వైకుంఠ నాథుడైన తిరుమలేశుడికి నివేదించే అన్న ప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. సేంద్రీయ బియ్యం స్థానంలో సాధారణ బియ్యం వినియోగించాలని భావిస్తోంది. త్వరలోనే స్వామివారికి సాధారణ బియ్యంతో చేసిన అన్న ప్రసాదాలను టీటీడీ నివేదించనుంది.
తిరుమల: కలియుగ వైకుంఠ నాథుడైన తిరుమలేశుడికి నివేదించే అన్న ప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం (TTD Key Decision) తీసుకోనుంది. సేంద్రీయ బియ్యం స్థానంలో సాధారణ బియ్యం (Plain Rice) వినియోగించాలని భావిస్తోంది. త్వరలోనే స్వామివారికి సాధారణ బియ్యంతో చేసిన అన్న ప్రసాదాలను టీటీడీ నివేదించనుంది. శ్రీవారి ప్రసాదాల తయారీలో టీటీడీ ఎప్పుడు మార్పులు చేసింది.. తిరిగి పాతపద్ధతిని స్వామివారికి ప్రసాదాలు నివేదించాలని.. టీటీడీ నిర్ణయం వెనుక అసలు కారణాలేంటి?
వైభోగవంతుడైన శ్రీనివాసునికి ఉత్సవాల నిర్వహణే కాదు.. స్వామివారికి నివేదించే ప్రసాదాల్లోనూ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆచార నియమాలతో శ్రీనివాసునికి దాదాపు 50 రకాల ప్రసాదాలు నివేదిస్తారు. కానీ అనునిత్యం తిరుమలను దర్శించుకునే వేలాది మంది భక్తులకు తెలిసిన ఒకే ఒక్క ప్రసాదం లడ్డూ మాత్రమే. భువిపై అమృతంగా చెప్పుకునే లడ్డూ భక్తులకు మహా ప్రసాదం. ఆర్జిత సేవల్లో స్వామివారిని దర్శించుకునే భక్తులకు వడ, దోశ, జిలేబి, మహా లడ్డు వంటి ప్రసాదాలు అందిస్తాయి. దర్శనం పూర్తి అయిన తర్వాత పులిహోర, పొంగలి, దద్దొజనం ప్రత్యేక వంటకాలు. కానీ శ్రీవారికి అనునిత్యం షడ్రసోపేతమైన పదార్థాలతో నిత్య నైవేద్యం జరుగుతుంది.
నిత్య కల్యాణ చక్రవర్తి తిరుమల వెంకన్నకు ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు, నివేదను జరుగుతాయి. వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యులు నిర్దేశించిన నిబంధనలే నేటికీ శ్రీవారి ఆలయంలో అమలు చేస్తున్నారు. ఆ మేరకే శ్రీవారికి నివేదనలు జరుగుతున్నాయి. స్వామివారికి సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు నివేదనలు సమర్పిస్తారు. రోజూ జరిగే నిత్య సేవలు, విరామ సమయంలో వివిధ రకాల నివేదనలు జరుగుతాయి. శతాబ్దాల తరబడి స్వామివారి ప్రసాదాలను అర్చకలు నివేదిస్తుండగా 2021 మే నెలలో నాటి వైసీపీ ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు మార్పులు చేసింది. పూర్వకాలపు ఆచారం పేరుతో సేంద్రీయ బియ్యంతో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి నివేదించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. 15 రకాల సేంద్రీయ బియ్యంతో ప్రసాదాలు తయారు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
TGPSC వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల ఆందోళన..
ప్రత్యేకత చాటుకున్న ఎంపీ కలిశెట్టి
బాలుడికి అరుదైన వ్యాధి.. సహాయం కోసం ఎదురుచూపులు..
చిత్తూరు కార్పొరేషన్‌లో వైసీపీకి భారీ షాక్
జగన్ హయాంలో భారీగా ఇసుక దోపిడీ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News