TTD: తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అలర్ట్..
ABN , Publish Date - Dec 16 , 2024 | 08:59 AM
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ భక్తులను అప్రమత్తం చేస్తూ.. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ భక్తులను అప్రమత్తం చేస్తూ.. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం (17వ తేదీ) నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. నెల రోజుల పాటు స్వామివారికి తిరుప్పావైతో మేల్కొలుపు ఉంటుంది. అలాగే ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు.
తిరుప్పావై నివేదన
తిరుమలలో ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేధ్యాలుగా దోశ, బెల్లం దోశ, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్..
ధనుర్మాసం ప్రారంభం అయిన నేపథ్యంలో టీటీడీ అధికారులు శ్రీవారి భక్తులను అలర్ట్ చేశారు. జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఇవాళ దర్శనాలకు 12 గంటల సమయం పడుతోంది. తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కగా నిన్న శ్రీవారిని 66,160 మంది భక్తులు దర్శించుకున్నారు. 22, 724 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లుగా నమోదు ఐంది. అలాగే సోమవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి ఆలయం సుప్రభాత సేవ రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు రెండు కీలక బిల్లులు..
జాకీర్ హుస్సేన్ మృతిపై చంద్రబాబు, లోకేష్ సంతాపం..
ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News