Share News

CM ChandraBabu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్

ABN , Publish Date - Nov 15 , 2024 | 08:59 PM

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా గడిచింది. ఈ పర్యటనలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో సీఎం చంద్రబాబు చర్చించారు.

CM ChandraBabu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సక్సెస్

న్యూఢిల్లీ, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటన విజయవంతమైందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించారు.

Also Read: పిచ్చి లేఖలు రాయడం మానుకోండి..

Also Read: నల్ల నువ్వుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?


శుక్రవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఈ అంశాలను వివరించారు. వ్యవసాయంపై ఆధారపడిన దానిలో గోదావరి - పెన్నా ప్రాజెక్ట్ ముఖ్యమైనదన్నారు. ఈ ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు. అలాగే అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై సైతం చర్చించామన్నారు. ఇక ఆర్థిక రంగంలో మార్పులపై విదేశాంగ మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారని తెలిపారు. ఆ క్రమంలో విద్యార్థులు, ప్రజల ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని విదేశాంగ మంత్రిని సీఎం కోరారని చెప్పారు.

Also Read: ఆ సమస్యలను పట్టించుకోరా అని మండిపాటు

Also Read: కాంగ్రెస్‌లోకి త్వరలో కారు పార్టీ ఎమ్మెల్యేలు


అలాగే రాష్ట్రంలో ఈజీ ఆఫ్ డూయింగ్‌తోపాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సైతం అమలు చేస్తున్నామన్నారు. పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఏపీకి ఆహ్వానించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు. అందుకు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని సీఎంకు కేంద్ర మంత్రి జై శంకర్ హామీ ఇచ్చారన్నారు.

Also Read: గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం..

Also Read:: అన్మోలా మజాకా.. దీని మెనూ చూస్తే కళ్లు తేలేయాల్సిందే


ఇక గతంలో రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించాలని సీఎం కోరారన్నారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.


రాష్ట్ర జీఎస్టీపై ఒక శాతం సర్‌ఛార్జి అదనంగా విధించే అవకాశాన్ని పరిశీలించాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం కోరినట్లు చెప్పారు. ఎందుకంటే ఇటీవల వరదల కారణంగా.. ముఖ్యంగా విజయవాడ నగరం చిన్నాభిన్నమైంది. చాలా మంది లక్షల్లో ఆస్తి నష్టపోయారు. ఈ నేపథ్యంలో వరదల నష్టం సంభవించిన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని వినియోగించే అవకాశముందని తెలిపారు. ఇది తాత్కాలిక ఉపశమనం కోసమే అని కేంద్ర మంత్రికి సీఎం ఈ సందర్భంగా వివరించారన్నారు. . గోదావరి - కృష్ణా - పెన్నా నదుల అనుసంధానానికి కేంద్ర సహాయ సహకారాన్ని ఇవ్వాలని కోరారు. నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.


నదుల అనుసంధానంతో వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్‌లోని క్షామ పీడిత ప్రకాశం, రాయలసీమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రికి సీఎం సోదాహరణగా వివరించారని చెప్పారు. అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటుతో.. భారత ఆర్థిక రంగంపై ఎటువంటి ప్రభావం చూపనుందనే అంశంపై సైతం చర్చించారన్నారు.


నవంబర్ 20వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మహారాష్ట్రలో ఎన్డీయే తరఫున రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అందుకోసం శనివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు మహారాష్ట్ర వెళ్లనున్నారని ఎంపీ లావు కృష్ణదేవరాయులు తెలిపారు.

For AndhraNews And Telugu News

Updated Date - Nov 15 , 2024 | 10:07 PM