Home » Lavu Sri Krishna Devarayalu
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు.
పదేళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరానని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకొన్న పరిస్థితి, జాప్యానికి కారణాలపై కూడా చర్చ జరగాలని కోరానని చెప్పారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా .. ఈ సమావేశాల్లో అనుసరించ వలసిన వ్యూహాంపై పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా గడిచింది. ఈ పర్యటనలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో సీఎం చంద్రబాబు చర్చించారు.
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇమాములు, ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వడంతోపాటు, హజ్ యాత్రకు రూ.లక్ష ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
వైసీపీ(YSRCP) పాలనలో ఏపీ అప్పులపాలైందని తెలుగుదేశం(TDP) పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయలు విమర్శించారు. అప్పుల భారం రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. మంగళవారం ఆయన ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ చేసిన అప్పులను పునర్వ్యవస్థీకరించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఎంతో అవసరమని టీడీపీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని చెప్పారు. పార్లమెంట్లో బడ్జెట్పై చర్చలు జరిపారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తోంటే బాదేస్తోందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) తెలిపారు. ఎంపీలుగా గెలిచిన ఆ ఆనందం ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ సంతోషం లేకుండా పోయిందని చెప్పారు.
జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.
ఏపీ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు (Sri Krishna Devarayalu Lavu) తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా లోక్ సభలో మాట్లాడారు.