Share News

Chandrababu: సీఎం చంద్రబాబు దెబ్బకు అధికారుల పరుగులు

ABN , Publish Date - Sep 02 , 2024 | 12:45 PM

ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా రాత్రింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తూ వస్తున్నారు...

Chandrababu: సీఎం చంద్రబాబు దెబ్బకు అధికారుల పరుగులు
CM Nara Chandrababu Naidu

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా రాత్రింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తూ వస్తున్నారు. ఆదివారం అంతా విజయవాడలోని (Vijayawada) పలు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. తెల్లారుజామున రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు. మళ్లీ యథావిధిగా రంగంలోకి దిగిన ఆయన వరద సహాయక చర్యలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఓ వైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు పవర్ బోట్స్ రావడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. సోమవారం ఉదయం నుంచి కూడా అధికారులను సీఎం పరుగులు పెట్టిస్తున్నారు.


CBN-Rain-Affected-Areas.jpg

బాబు కారెక్కి..

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. నిన్న అంతా పర్యటనకు పరిమితం అయిన సీఎం.. ఇవాళ మళ్లీ క్షేత్ర స్థాయి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కారెక్కిన చంద్రబాబు.. తాను చెప్పిన ప్రాంతానికి పోవాలన్న అధికారులను ఆదేశిస్తున్నారు. సహాయక చర్యల్లో అలసత్వం వదలగొట్టేలా ముఖ్యమంత్రి టూర్లు సాగుతున్నాయి. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబు వరుస తనిఖీలతో అధికారులు పరుగులు పెడుతోన్న పరిస్థితి. తనతో సంబంధం లేకుండా.. తన వెంట రాకుండా సహాయక చర్యల్లో నిమగ్నమవ్వాలని అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నం.. నీట మునిగిన రామలింగేశ్వర్ నగర్ ప్రాంతం వైపు వెళ్లిన చంద్రబాబు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసినా వరద రావడం‌పై అధికారులు, వరద బాధితులను అడిగి సీఎం వివరాలు తెలుసుకుంటున్నారు.

సీఎం చంద్రబాబు వెళ్లొచ్చినా అధికారుల్లో రాని మార్పు



Chandrababu-Flood-Affected-.jpg

బాబు దెబ్బకు..!

కాగా.. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో తాగడానికి నీరు, తినడానికి తిండి లేక వరద బాధితులు అల్లాడుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే.. చంద్రబాబు ఇదివరకే ఆ ప్రాంతంలో పర్యటించినా సరే సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిపోయిన సీబీఎన్.. అధికారులను పరుగులు పెట్టించారు. బాబు రాకతో ఎక్కడికక్కడ అలర్ట్ అయిన ఆఫీసర్లు.. బాధితులకు ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్న పరిస్థితి. మరోవైపు.. బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూ సమీక్ష నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆహార పంపిణీ ఎంతమేరకు పంపిణీ చేశారో కూడా స్వయంగా చంద్రబాబే డివిజన్ల వారీగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇతర జిల్లాల్లో తయారు చేసి తరలిస్తున్న ఆహారంపైనా ఆరా తీసిన బాబు.. పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి దుస్తులు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు.. గేట్‌కు డ్యామేజీ.. ఎన్నో అనుమానాలు!

Updated Date - Sep 02 , 2024 | 12:50 PM