Share News

Wayanad Landslides: ఏపీ ప్రభుత్వం పెద్ద మనసు.. వయనాడ్ బాధితులకు రూ.10 కోట్ల సాయం

ABN , Publish Date - Aug 16 , 2024 | 08:44 PM

వయనాడ్ బాధితులకు మేమున్నామంటూ ఏపీ సర్కార్(AP Govt) ముందుకు వచ్చింది. కేరళ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం ఏకంగా రూ.10కోట్ల విరాళాన్ని అందజేసేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కార్ నిర్ణయించింది.

Wayanad Landslides: ఏపీ ప్రభుత్వం పెద్ద మనసు.. వయనాడ్ బాధితులకు రూ.10 కోట్ల సాయం

అమరావతి: వయనాడ్ బాధితులకు మేమున్నాం అంటూ ఏపీ సర్కార్ (AP Govt) ముందుకు వచ్చింది. కేరళ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం ఏకంగా రూ.10కోట్ల విరాళాన్ని అందజేసేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కార్ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కేరళ సీఎం సహాయనిధికి శుక్రవారం అందజేసింది.

వయనాడ్‌లో(Wayanad Landslides) జులై 30న కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సుమారు 400 మందికి పైగా ప్రజలు మరణించగా.. వందల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. బాధితులంతా సర్వస్వం కోల్పోయారు. వారికి అండగా నిలవడానికి స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని కేరళ ప్రభుత్వం కోరింది. బాధిత కుటుంబాలకు సాయం చేయడానికి ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు, కంపెనీల అధినేతలు, ప్రముఖులు, సామాన్యులు ముందుకువచ్చారు.


AP-Fund-For-Wayanad.jpg

అండగా టాలీవుడ్..

వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ.2 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు రాంచరణ్ రూ.కోటి, అల్లు అర్జున్ రూ.25 లక్షలు, రష్మిక మందన్నా రూ.10 లక్షల చొప్పున విరాళాలు అందించారు. సీనియర్ నటులు సుహాసిని, శ్రీప్రియ, కుష్బూ, మీనా, కళ్యాణి ప్రియదర్శన్, లిస్సి లక్ష్మి, శోభన రూ.కోటి చెక్కును కేరళ సీఎం పినరయి విజయన్‌కి అందించారు. తమిళనాడు సర్కార్ రూ. 5 కోట్లు ఆ రాష్ట్ర సీఎం సహాయనిధికి అందజేసింది. అదానీ గ్రూప్ సంస్థ తమ కంపెనీ తరఫున రూ.5 కోట్ల సాయాన్ని సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్పీ గ్రూప్‌ రవి పిళ్లై, లులు ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ, కల్యాణ్‌ జువెలర్స్‌ ఛైర్మన్‌ కల్యాణరామన్‌లు కూడా ఒక్కొక్కరు రూ.5 కోట్లచొప్పున విరాళాలను అందించారు.


ప్రముఖులు ఇలా..

కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్‌ప్రైజెస్ సహాయనిధికి రూ.5 కోట్లు, కెనరా బ్యాంక్ కూడా సీఎండీఆర్‌ఎఫ్‌కు రూ.5 కోట్లు ఇచ్చింది. కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ (KMML) రూ. 50 లక్షలు, కేరళ స్టేట్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ. 30 లక్షలు, నటుడు విక్రమ్ రూ. 20 లక్షలు, దలైలామా ట్రస్ట్ రూ. 11 లక్షలు, శోభనా జార్జ్, చైర్‌పర్సన్, ఔషధి (ఆయుర్వేద ఔషధాల తయారీదారు) రూ. 10 లక్షల చొప్పున విరాళాలు అందించాయి. ఇలా తోచిన విధంగా సాయం చేస్తూ వయనాడ్ బాధితులకు మేమున్నాం అనే భరోసా కల్పిస్తున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 08:57 PM