AP Politics: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మశ్రీ, రాకేశ్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు..
ABN , Publish Date - Jun 26 , 2024 | 02:59 PM
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party)లో వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్ఠానం నుంచి వచ్చిన నిధుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా(Sharmila), ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఆరోపణలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party)లో వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్ఠానం నుంచి వచ్చిన నిధుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా(Sharmila), ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీనిపై వివరణ ఇవ్వాలంటూ తాజాగా వారికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.
నోటీసులకు సమాధానంగా పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఓ లేఖను పంపించారు. ఏపీలో ఈనెల 20న పార్టీకి చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారని, అన్ని కమిటీలు రద్దు చేసినప్పుడు క్రమశిక్షణ కమిటీ కూడా రద్దు అవుతుందని లేఖలో తెలిపారు. నోటీసుల్లో పేర్కొన్న విధంగా వివరణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నా ఎవరికి ఇవ్వాలో అయోమయంలో ఉన్నామని ఎద్దేవా చేశారు. మెుదట తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు.