Share News

Development of the College : కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి

ABN , Publish Date - Sep 14 , 2024 | 11:15 PM

విద్యాబుద్దులు వినయసంపన్నత నేర్పి జీవితమంటే ఏమిటో అవగాహన కల్పించి సమాజంలో గౌరవంగా బతికేలా తయారు చేసిన ప్రభుత్వ ఆర్ట్స్‌కళాశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని పూర్వవిద్యార్థులు ముక్తకంఠంతో ఉద్ఘాటించారు.

Development of the College : కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి
కేరళ టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె.శ్రీనివాస్‌ను సత్కరిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్‌, పూర్వవిద్యార్థులు

ప్రతిభావంతులకు బంగారు పతకాలు

75 వసంతాల వేడుకలో పూర్వవిద్యార్థులు

కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 14: విద్యాబుద్దులు వినయసంపన్నత నేర్పి జీవితమంటే ఏమిటో అవగాహన కల్పించి సమాజంలో గౌరవంగా బతికేలా తయారు చేసిన ప్రభుత్వ ఆర్ట్స్‌కళాశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని పూర్వవిద్యార్థులు ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు బంగారు పతకాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. శనివారం కడప నగరం ఆర్ట్స్‌ కళాశాల 75వసంతాలు పూర్తి చేసుకుని ప్లాటి నం జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశంలో పూర్వవిద్యార్ధి కేరళ టూరిజం డిపార్టుమెంట్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థులంతా ఒకటిగా తయారై ఇప్పటికీ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. కళాశాలను దీర్ఘకాలం తరువాత చూస్తూనే నాటి రోజులు గుర్తుకు వచ్చాయన్నారు. ఏపీ విశ్రాంత డీఐజీ లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ డబ్బు సంపాదించాక దానిని సామాజిక అవసరాలకు వెచ్చించాలని, ఫలితంగా జీవన కాలం పెరుగుతుందన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ విశ్రాంత కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు ఎ.రెడ్డి మాట్లాడుతూ పేదల కళాశాల ఆర్ట్స్‌ కాలేజీ అని, ఎందరో నాలాంటి వారికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చిందన్నారు. ఇక్కడ టీచర్ల అంకితభావం నిబద్దత గొప్పదన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివి తే ఏమవుతారంటే ఇలా సివిల్‌ సర్వెంట్‌ అవుతారని చెప్పాలన్నారు.


టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌శ్రీనివాసరెడ్డి మాట్లాడు తూ ఈ కళాశాలలో చదివిన వారు విభిన ్నరంగాల్లో రాణించాలని ఉదహరించారు. కళాశాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ద్వారా నిధులు ఖచ్చితంగా తెప్పించి ప్రగతి దిశగా తీసుకువెళతామన్నారు. విశ్రాంత మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ బీకాం కోర్సులో ప్రతిభావంతులకు బంగారు పతకం కోసం ఏటా 50వేలు ఇస్తానని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ వెంకటశివవారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ చదువు నేర్పిన కళాశాలకు ఎమ్మెల్సీగా కొంత రు ణం తీర్చుకున్నానన్నారు. హైదరాబాదు ప్రఖ్యాత రచయిత ఉషారాణి మాట్లాడుతూ గుప్పెడంత మనసు అనే టీవీ సీరియల్‌లో రుషి క్యారెక్టరును నాటి ఆధ్యాపకుడు కథగా తీసుకు ని రాశారంటే ఆ రోజుల్లో అధ్యాపక ఆదర్శనీయ జీవితం ఎంత గొప్పగా ఉందో చెప్పుకోవచ్చన్నారు. చైతన్యకెమికల్స్‌ అధిపతి రామ్మూర్తి, ఎస్‌కే యూనివర్శిటీ ప్రొఫెసరు ఎంఆర్‌కె రెడ్డి నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకన్నారు. కళాశాల ప్రతిభావంతుల కోసం శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డుగ్రహీత బీఎల్‌ఎస్‌ ప్రకాశ్‌ రూ.2లక్షలు ప్రకటించారు. పూర్వవిద్యార్థులను కళాశాల తరపున ప్రిన్సిపాల్‌ ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రవీంద్రనాధ్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎస్వీ యూనివర్శిటీ మాజీ రిజిస్ట్రారు, కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సమన్వయకర్త ప్రొఫెసరు రాజశేఖర్‌రెడ్డి, అలుమ్ని కార్యదర్శి కె.శివరాం, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.


Lokayuktha.gifజస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డిని సన్మానిస్తున్న వైవీయూ వీసీ

చదువుతో పాటు సమాజ జ్ఞానం పొందాలి

- లోకాయుక్త, ఆర్ట్స్‌కళాశాల పూర్వవిద్యార్ధి జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి

కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 14: విద్యార్థులకు సమాజ జ్ఞానం అవసరం. చదువుసహా పాఠ్యేతర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లోకాయుక్త, ఆర్ట్స్‌కళాశాల పూర్వవిద్యార్థి జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఆర్ట్స్‌కళాశాల ప్లాటినం జూబ్లీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కళాశాలలో పీయూసి డిగ్రీ చదివానని, విద్యార్థి యూనియన్‌ ఛైర్మన్‌గా క్రియాశీలకంగా వ్యవహరించానన్నారు. సమాజంలో జరిగే సంఘటనలపై కూడా ఆ రోజుల్లో స్పందించాం, నా ఎదుగుదలలో మా గురువుల పాత్ర చాలా గొప్పది. చాలకాలం తరువాత చదివిన కళాశాలకు రావడం పెద్ద అనుభూతినిచ్చింది. పాత మిత్రులను కలవడానికి అవకాశం కల్పించిన ప్లాటినం జూబ్లీ నిర్వహకులకు అభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ రవీంద్రనాధ్‌ కృషిని ప్రశంసించారు. వైవీయూ వీసీ క్రిష్ణారెడ్డి రాయలసీమలాంటి కరువు సీమలో ఈ కళాశాల ఎందరో విద్యార్థులను గొప్పగొప్ప స్థాయికి పంపిందంటే నాటి గురువుల అంకితభావం, క్రమశిక్షణ గొప్పదన్నారు. కారణాలు అన్వేషించాలని మేధావులు రోడ్‌మ్యాప్‌ తయారు చేయాలన్నారు. కళాశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. విశ్రాంత ప్రిన్సిపాళ్లు సుబ్బిరెడ్డి, జనార్ధనరెడ్డి, ద్రవిడ యూనివర్శిటీ ప్రొఫెసరు కరీముల్లా పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 11:15 PM