Share News

Rains: రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ABN , Publish Date - Nov 26 , 2024 | 04:19 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఇది మంగళవారం తుఫాన్‌గా మారే అవకాశముందని తెలిపింది.

Rains: రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

అమరావతి, నవంబర్ 26: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఇది ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు.. నాగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు.. అలాగే పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు.. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఇది మరింత బలపడి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ.. రేపటికి అంటే బుధవారానికి తుఫాన్‌గా మారే అవకాశముందని పేర్కొంది.

Also Read: ఏపీలో ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల


అయితే గడచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతుందని చెప్పింది. తదుపరి రెండు రోజుల్లో ఉత్తర వాయవ్య దిశగా శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు తీరం వైపు ఇది ప్రయాణించే అవకాశముందని వివరించింది. ఈ నేపథ్యంలో రానున్న ఆరు రోజులు పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంద్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. అలాగే రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Also Read: మున్సిపల్ కమిషనర్‌ నివాసంపై ఏసీబీ దాడి.. కీలక పత్రాలు స్వాధీనం


అలాగే రానున్న 48 గంటలలో అన్నయ్యమ్మ, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఇక నవంబర్ 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో బలంగా గాలులు వీస్తాయంది.


ఇటువంటి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా భారత వాతావరణ కేంద్రం గుర్తు చేసింది.


మరోవైపు తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ స్పందించారు. జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆయన అప్రమత్తం చేశారు. అలాగే పంట కోతకు వచ్చే సమయం కూడా కావడంతో.. రైతులకు ఆయన కీలక సూచన చేశారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు స్పష్టం చేశారు. అలాగే నవంబర్ 27వ తేదీ నుంచి 29 వరకు మత్స్య కారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్ల వద్దని హెచ్చరించారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Nov 26 , 2024 | 04:48 PM