Daggubati Purandeswari: కార్యకర్తల సమిష్టి కృషితో ఎన్‌డీఏ కూటమి విజయం ఖాయం
ABN , Publish Date - May 15 , 2024 | 06:09 PM
కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) స్పష్టం చేశారు. బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో భాగంగా ఈ మేరకు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారిత పార్టీ అని పురంధేశ్వరి ఈ సందర్భంగా అన్నారు.
కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) స్పష్టం చేశారు. బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో భాగంగా ఈ మేరకు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారిత పార్టీ అని పురంధేశ్వరి ఈ సందర్భంగా అన్నారు. పార్టీ అభివృద్ధి చెందడంలో కార్యకర్తల పాత్ర ఎంతో ఉందని, ఈ నేపథ్యంలో వారి సేవలను ప్రశంసిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు అందరీ సమిష్టి కృష్టితో ఇటు ఏపీలో అటు దేశంలో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని దగ్గుబాటి పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.
ప్రధానంగా ఇటివల ఎన్నికల(ap elections 2024) సమయంలో కార్యకర్తలు పార్టీకి అందించిన సేవలు మరువలేనివని పురంధేశ్వరి(Purandeswari) అన్నారు. పార్టీ ప్రచారంతో మొదలుకుని ప్రతి విభాగంలో కూడా కార్యకర్తలు ఎంతో సేవ చేశారని, వీరు లేకుండా పార్టీ లేనే లేదని అన్నారు. మరోవైపు ఇటివల జరిగిన ఏపీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి 81.6 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారోనని రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి:
AP Politics: టియర్ గ్యాస్ ఎఫెక్ట్.. జేసీకి అస్వస్థత
AP News: పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండించిన గండి బాబ్జీ
Read Latest AP News And Telugu News