Share News

Pawan Kalyan: చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు షూటింగ్‌లకు రానని చెప్పా.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 18 , 2024 | 06:46 PM

సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు షూటింగ్‌లకు వెళ్లలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు.

Pawan Kalyan: చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు షూటింగ్‌లకు రానని చెప్పా.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: సీఎం చంద్రబాబుపై(CM Chandrababu) అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు షూటింగ్‌లకు వెళ్లలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉందని.. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏనాడూ ఆయన కళ్లలో భయం కనిపించలేదని అన్నారు.


"సమష్టి కృషితో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. మొదటి నుంచి 160 స్థానాలు గెలవాలని చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. చంద్రబాబులో భయం లేదు. అపారమైన అనుభవం ఉంది. బాబు తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు.. చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని అవమానపరిచారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు ఆయన్ని బలి చేశారు. రాజమండ్రి జైల్లో కలిసినప్పుడు ఆయన గుండె ధైర్యాన్ని చూశా. బాబులో ఆత్మస్థైర్యం ఏనాడూ దెబ్బతినలేదు. పాలన ఎలా ఉండాలో బాబు పక్కనే ఉండి నేర్చుకోవాలనుకున్నా. జైల్లో ఉన్నప్పుడు నేను సినిమా షూటింగులకు కూడా వెళ్లలేదు. షూటింగ్‌కు రావాలని ప్రొడ్యూసర్లు అడిగినా నేను రానని చెప్పా. విభజన కాలం నుంచి జగన్ పాలన వరకు రాష్ట్రం నలిగిపోతూనే ఉంది. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది" అని పవన్ తెలిపారు.

For Latest News and National News click here

Updated Date - Sep 18 , 2024 | 06:46 PM