Dwaraka Tirumala: ఆలయంలో బంగారం చోరీ
ABN , Publish Date - Mar 02 , 2024 | 06:40 PM
ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో భక్తుడికి సంబంధించిన బంగారం చోరీకి గురైంది. గాజువాకకు చెందిన సత్య భాస్కర్‌రావు అనే వ్యక్తి తన కుటుబంతో సహా రావులపాలెంలో వివాహ వేడుకకు హాజరైన అనంతరం ద్వారకాతిరుమల దర్శనానికి వచ్చారు.
ఏలూరు: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో (Dwarakathirumala temple) భక్తుడికి సంబంధించిన బంగారం చోరీకి గురైంది. గాజువాకకు చెందిన సత్య భాస్కర్‌రావు అనే వ్యక్తి తన కుటుబంతో సహా రావులపాలెంలో వివాహ వేడుకకు హాజరైన అనంతరం ద్వారకాతిరుమల దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో సెంట్రల్ పార్కింగ్ వద్ద పార్కింగ్ చేసిన కారులో తమ దగ్గర ఉన్న 35 కాసుల బంగారాన్ని ఉంచి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం వచ్చి చూడగా కారులో ఉంచిన బంగారం కనిపించలేదు. దీంతో బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కొండపై ఉన్న సీసీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.