Share News

కష్టాలు.. కన్నీళ్లు

ABN , Publish Date - Sep 04 , 2024 | 04:51 AM

ఎక్కడుంది లోపం.. ఎవరిది వైఫల్యం.. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినా..

కష్టాలు.. కన్నీళ్లు
Heavy Rains In Andhra Pradesh

హాహాకారాలు.. ఆర్తనాదాలు.. ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన సాయం

మారుమూల ముంపు దాకా చేరని ఆహారం

మూడు రోజులుగా ఆకలి దప్పులతో వేదన

ప్రాణాలకు తెగించి వరదనీటిలో నడక

బతుకు జీవుడా అని ఒడ్డుకు చేరుతున్న దైన్యం

ట్యూబులు, థర్మోకోల్‌ షీట్లే పడవలు

వాటిపైనే పిల్లలు, వృద్ధుల తరలింపు

ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఆహారం

దానిని బాధితులకు అందించే దారేదీ?

పెద్దసంఖ్యలో పడవలు వచ్చినా రోడ్లమీదే

సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌పై వాహనాలు, జనం జాతర

అచ్చెన్న చెప్పినా క్లియర్‌ చేయని వైనం

జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయ లోపం

సీఎం వస్తే తప్ప అడుగు బయటపెట్టని కలెక్టర్‌

బుడమేరు బాధితుల్లో తీవ్ర ఆవేదన, ఆక్రోశం

ghl.jpg


వరద వచ్చిన మొదటి రోజు పరిస్థితిని అంచనా వేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. రెండోరోజున... వరద పోటు వల్ల లోపలికి పోలేకపోయారంటే సరే అనుకోవచ్చు. కానీ... వరద కొంత తగ్గినా, వరుసగా మూడో రోజున కూడా ‘సాయం’ జోరందుకోకపోవడానికి కారణమేమిటి?

ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ ఫోన్లు మూగనోము పట్టాయి. ఏరియాల వారీగా పర్యవేక్షకులను నియమించారని తెలుసుకుని ఫోన్లు చేస్తే స్విచ్చాఫ్ వస్తున్నాయి.

సహాయక చర్యల్లో కొందరు బోటు ఆపరేటర్లు కాసుల కక్కుర్తి ప్రదర్శించారు. ఒక్కొక్కరికి రూ.2 వేలు ఇస్తేనే బయటికి తీసుకొస్తామని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.

flb.jpg


(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

ఎక్కడుంది లోపం? ఎవరిది వైఫల్యం? స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినా... మంత్రులంతా నీళ్లలో ఉన్నా బాధితులకు ఉపశమనం ఎందుకు లభించడం లేదు? బెజవాడ వరద బాధితులను మూడో రోజూ ఎందుకు కష్టాలు వీడటం లేదు? ఇవి విస్మయ పరిచే ప్రశ్నలు! వరద బాధిత ప్రాంతాల్లో కనిపిస్తున్న వాస్తవాలు! బుడమేరు వరద బాధితుల సహాయక చర్యలలో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడంలో వేగం మందగించింది. శాఖల మధ్య సమన్వయం లోపించడం, ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో... మంగళవారం మూడో రోజు కూడా వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.


బతుకు కోసం చావుతో పోరాడి..

విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని 15 డివిజన్లు బుడమేరు వరదలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారి నుంచి బాగా లోపలున్న వారికి మంగళవారం కూడా సాయం అందలేదు. మొదటి అంతస్తు దాటి పైన ఉన్న వారికి ఇళ్లలో అన్నీ ఉన్నా నీళ్లు లేవు. పాలు లేవు. కరెంటు లేదు. మూడు రోజులుగా ఆహారం, నీరు లేక నీరసించడంతో బతుకు కాపాడుకునేందుకు... ప్రాణాలకు తెగించి వరద బాధితులే వరద నీళ్లలో బయటకు వచ్చారు. మెడలోతు, నడుములోతున్న నీళ్లలో కర్రలు ఆసరాగా చేసుకుని, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఒడ్డుకు చేరుతున్న వారు కోకొల్లలుగా కనిపించారు. ఎన్డీఆర్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, బోట్లు, మర బోట్లు అని అధికారులు చాలానే చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి బోట్లు వచ్చినా వాటిని కిందికి దించలేదు. ఉన్న అరకొర బోట్లనే తిప్పుతున్నారు. దీంతో... చాలామంది బాధితులే నానా తంటాలు పడుతూ ఒడ్డున పడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, పక్షవాతంతో మంచం పట్టిన వారిని కూడా బయటికి తీసుకురాలేని దైన్యం నెలకొంది. ుఫలానా చోట పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు. దయచేసి బోటునో, ట్రాక్టర్‌నో పంపించి ఆదుకోండి్‌ అని స్వయంగా జిల్లాస్థాయి అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయింది. ఫ్రిజ్‌ డోర్లు విరిచి పెద్ద వాళ్లను అందులో పడుకోబెట్టి వరద దాటిస్తుండటం... సన్నిహితులు పంపిన గాలి నింపిన ట్యూబుల సహాయంతో బయటపడటం... థర్మోకోల్‌ షీట్లను పడవలుగా, లైఫ్‌జాకెట్లుగా మార్చుకోవడం... వంటి హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. కొంతమంది ఏకంగా రెండు-మూడు కిలోమీటర్లు నీళ్లలో నడుస్తూ బయటికి వచ్చారు. చలితో వణికి పోయారు. చాలామంది ఆహారం, నీరు లేక బలహీనంగా కనిపించారు.


30 శాతం దాటని సాయం...

వరద ముంపులో చిక్కుకున్న ప్రాంతంలో 30 శాతం ప్రాంతానికి మాత్రమే ఆహారం, మంచినీళ్లు అందించినట్లు అంచనా. ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న వారిని మినహాయిస్తే... లోపలున్న వారికి గత మూడు రోజులుగా ఆహారం అందలేదు. కనీసం మంచినీళ్లు కూడా అందలేదు. అష్టకష్టాలు పడుతూ బయటకు వచ్చిన బాఽధితుల్లో ఎవరిని పలకరించినా మూడు రోజులుగా తమకు ఆహారం, మంచినీళ్లు అందలేదని వాపోయారు. వరద నుంచి బయటకు వచ్చే వారికి ఆహారం ఇస్తున్నారే తప్ప... బయటకు రాలేని వారికి బోట్ల మీద వెళ్లి ఇచ్చే ప్రయత్నాలు సరిగా జరగడంలేదు. అంబాపురం, కండ్రిక, పీఅండ్‌టీ కాలనీ, ఇందిరానాయక్‌ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ తదితర లోతట్టు దూర ప్రాంత వాసులు మూడు రోజులుగా మంచినీరు కూడా లేకుండా విలవిల్లాడిపోతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆహారాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. ఆహారం పాడైపోతోందని, బాధితులకు పంచాలని ఇక్కడి అధికారులకు ఆయా జిల్లాల అధికారులు ఫోన్‌ చేసినా స్పందన కనిపించడంలేదు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ల కళ్లముందే కనిపిస్తున్నా... ఆహారం తీసుకుని పంపిణీ చేయడం మా వల్ల కాదు. అది మా బాధ్యత కాదు్‌ అని తేల్చి చెబుతున్నారు.


ఫ్లైఓవర్‌ దాటని సాయం

ప్రస్తుతానికి వరద సహాయం మొత్తం అజిత్‌సింగ్‌ నగర్‌ ఫ్లైఓవర్‌కు పరిమితమవుతోంది. ఆహారంతో వచ్చిన వాహనాలు ఫ్లై ఓవర్‌ మీదనే ఆగిపోతున్నాయి. బాధితులకు అక్కడే ఆహార పొట్లాలు అందిస్తున్నారు. అందులోనూ ఒక తీరూ తెన్ను లేదు. ఫ్లై ఓవర్‌ మీద ఆహార ప్యాకెట్లు చిందర వందరగా పడి ఉన్నాయి. వరద లోపల ఎంతో మంది ఆకలితో అలమటిస్తుండగా... బయట ఇలా వ్యర్థమవుతోంది.


కలెక్టర్‌ ఎక్కడ??

కీలకమైన సమయంలో ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం పనితీరు మొక్కుబడిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టరేట్‌కు ఫోన్లు చేసినా స్పందించటం లేదని, కంట్రోల్‌ రూమ్‌ శుద్ధ దండగ అని బాధితులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వస్తే తప్ప ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన సహాయక చర్యలను పర్యవేక్షించ టానికి క్షేత్రస్థాయికి రావటం లేదని చెబుతున్నారు. అధి కార యంత్రాంగంకంటే... టీడీపీ, జనసేన, సీపీఎంనేతలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులే బాగాపని చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.


చేష్టలుడిగిన పోలీసు

రెండు లక్షల మందికి పైగా ఉన్న వరద బాధితులను రక్షించాల్సిన చోట పోలీసు యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోం ది. బుడమేరు బ్రిడ్జి దాటిన తర్వాత సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ మీ ద భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు, ఆహార వాహనాలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ఇది సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. ఫ్లైఓవర్‌ ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌ చేయాలని, అప్పుడే సహాయక చర్యలు చేపట్టగలమని మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం నగర పోలీసు కమిషనర్‌కు వాకీటాకీలో పదేపదే చెప్పారు. మంగళవారం ఈ పరిస్థితి ఇంకాస్త ఎక్కువైందే తప్ప తగ్గలేదు. సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ను ఖాళీ చేస్తే తప్ప సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.


ఫోన్ల మూగనోము

గత మూడు రోజులుగా వరద ప్రాంతంలో విద్యుత్‌ లేకపోవటంతో చాలా మంది ఫోన్లు స్విచ్చాఫ్‌ అయిపోయాయి. సాయం కోరే దారీ లేకుండా పోయింది. విద్యుత్‌ లేకపోవటంతో సెల్‌ టవర్లు కూడా పనిచేయడంలేదు. జనరేటర్ల ద్వారా వాటిని నడిపించేందుకు డీజిల్‌ పంపించినా... టవర్ల దాకా చేరే మార్గం కనిపించడంలేదు. అన్నీ ఉన్నా నీళ్లు లేవు. పాలు లేవు. కరెంటు లేదు. మూడు రోజులుగా ఆహారం, నీరు లేక నీరసించడంతో బతుకు కాపాడుకునేందుకు... ప్రాణాలకు తెగించి వరద బాధితులే వరద నీళ్లలో బయటకు వచ్చారు. మెడలోతు, నడుములోతున్న నీళ్లలో కర్రలు ఆసరాగా చేసుకుని, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఒడ్డుకు చేరుతున్న వారు కోకొల్లలుగా కనిపించారు. ఎన్డీఆర్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, బోట్లు, మర బోట్లు అని అధికారులు చాలానే చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి బోట్లు వచ్చినా వాటిని కిందికి దించలేదు. ఉన్న అరకొర బోట్లనే తిప్పుతున్నారు. దీంతో... చాలామంది బాధితులే నానా తంటాలు పడుతూ ఒడ్డున పడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, పక్షవాతంతో మంచం పట్టిన వారిని కూడా బయటికి తీసుకురాలేని దైన్యం నెలకొంది. ుఫలానా చోట పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు. దయచేసి బోటునో, ట్రాక్టర్‌నో పంపించి ఆదుకోండి్‌ అని స్వయంగా జిల్లాస్థాయి అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయింది. ఫ్రిజ్‌ డోర్లు విరిచి పెద్ద వాళ్లను అందులో పడుకోబెట్టి వరద దాటిస్తుండటం... సన్నిహితులు పంపిన గాలి నింపిన ట్యూబుల సహాయంతో బయటపడటం... థర్మోకోల్‌ షీట్లను పడవలుగా, లైఫ్‌జాకెట్లుగా మార్చుకోవడం... వంటి హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. కొంతమంది ఏకంగా రెండు-మూడు కిలోమీటర్లు నీళ్లలో నడుస్తూ బయటికి వచ్చారు. చలితో వణికి పోయారు. చాలామంది ఆహారం, నీరు లేక బలహీనంగా కనిపించారు.


మరణ వేదన...

మృతదేహాలను తరలించడంపైనా అదే నిర్లక్ష్యం. సింగ్‌నగర్‌లో ఉండే పద్మావతి అనే మహిళ గుండెపోటు తో మరణించారు. ఎంత బతిమలాడినా మృతదేహాన్ని బయటకు తెచ్చేందుకు బోట్ల సిబ్బంది ససేమిరా అన్నా రు.. చివరికి ఆమె భర్త తోపుడు బండి మీద మృతదేహాన్ని పెట్టి... 3 కిలోమీటర్లు వరదలో తీసుకుని వచ్చారు. సింగ్‌నగర్‌ పైపుల రోడ్డు సమీపంలోని ఏ1 టీ స్టాల్‌ దగ్గరకు 2 రోజుల కిందట ఓ మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతదేహం ఉబ్బిపోయి దుర్వాసన వస్తున్నా అదే పరిస్థితి. ఉడా కాలనీలో మూడేళ్ల చిన్నారి వరదనీటిలో పడింది. మంగళవారం ఉదయం డ్రెయినేజీలో పాప మృతదేహం కనిపించింది. కొత్త రాజరాజేశ్వరిపేటలో పెద్దాభక్తుని నా యుడు, చీపురుపల్లి నాయుడులు వరదలో పడి చనిపోయారు. మృతదేహాలను తరలించాలని అధికారులను కోరి నా ఫలితం లభించలేదు. స్థానిక టీడీపీ నాయకుడు ఎరుబోతు రమణారావు ఆ మృతదేహాలను తరలించారు...

Updated Date - Sep 04 , 2024 | 08:19 AM