AP Politics: ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు..
ABN , Publish Date - Mar 12 , 2024 | 11:05 AM
వైసీపీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. జనసేనలో చేరిన వంశీకృష్ణ, టీడీపీలో చేరిన సి రామచంద్రయ్యపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు చర్యలు తీసుకున్నారు.
అమరావతి: వైసీపీ (YSRCP) వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్ (Vamsi Krishna Yadav), సి రామచంద్రయ్య (C Ramachandraiah)పై అనర్హత వేటు పడింది. జనసేన (Janasena)లో చేరిన వంశీకృష్ణ, టీడీపీ (TDP)లో చేరిన సి రామచంద్రయ్యపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు చర్యలు తీసుకున్నారు. వంశీకృష్ణ, రామచంద్రయ్యలు వైసీపీ తరుఫున విజయం సాధించి ఆపై ఇటీవల పార్టీ మారారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్‌సీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం వంశీకృష్ణ, రామచంద్రయ్యలపై శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు.
Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే సీట్ల పంపకం..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.