Kakinada: వైసీపీ సర్కార్‌పై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం..
ABN , Publish Date - Jan 16 , 2024 | 10:30 AM
కాకినాడ: వైసీపీ సర్కార్‌పై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి దాడిశెట్టి రాజా..వైసీపీ ఏమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ వేధిస్తున్నారంటూ ఓ మహిళ సంచలన ఆరోపనలు చేసింది. వారికి తోడు పోలీసులు గుండాల్లా వ్యవహరిస్తున్నారంటూ ఓ వీడియో విడుదల చేసింది.
కాకినాడ: వైసీపీ సర్కార్‌పై ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి దాడిశెట్టి రాజా..వైసీపీ ఏమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ వేధిస్తున్నారంటూ ఓ మహిళ సంచలన ఆరోపనలు చేసింది. వారికి తోడు పోలీసులు గుండాల్లా వ్యవహరిస్తున్నారంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ విషయంలో సీఎం జగన్‌ను కలిసినా న్యాయం జరగలేదంటూ ఆరుద్ర అనే మహిళ ఆరోపించింది. తననూ, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని.. రోజూ పోలీసులు వచ్చి వేధించడంతో తట్టుకోలేక కాశీ పారిపోయి తలదాచుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించింది.
గతేడాది సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్య యత్నం చేసిన ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ వీడియో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ వదిలి బయటకు రావడంలేదని, ఇలా అయితే పేదలకు న్యాయం ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించింది. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ తన రక్షణ కోసం డీజీపీకి లేఖ రాశారని.. అయినా న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతమైంది.
తన కూతురికి వెన్నెముక సమస్య ఉందని.. పోరాడితే తీసుకెళ్ళి మెంటల్ ఆసుపత్రిలో చేర్చారని ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేసింది. రోజూ పోలీసులు ఇంటికి వచ్చి వేధిస్తున్నారని, తట్టుకోలేక కాశీ పారిపోయి వచ్చి తలదాచుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికైనా తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని ఆరుద్ర ఆ వీడియోలో పేర్కొంది.