AP News: వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్
ABN , Publish Date - Dec 03 , 2024 | 07:36 AM
కాకినాడ: వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్ తగిలింది. రొయ్యల ప్రోసెస్ ద్వారా వచ్చే కాలుష్య వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా బయటకు విడుదల చేస్తున్నారు. ఫ్యాక్టరీల కాలుష్యంపై పీసీబీకి దొంగ లెక్కలతో మాయ చేస్తున్నారు. అనుమతి లేకుండా లోపల ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. గ్రీన్ బెల్ట్ లేకుండా ఉన్నట్లు మాయ చేసి చూపారు. వీటి ఉల్లంఘనలను అధికారులు తనిఖీల్లో గుర్తించి ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
కాకినాడ: వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి (SRCP Ex MLA Dwarampudi) మరో షాక్ (Another Shock) తగిలింది. లంపకలోవలో ఆయన రొయ్యల ఫ్యాక్టరీ (Shrimp Factory)ని అధికారులు సీజ్ (Siege) చేశారు. ఆ ఫ్యాక్టరీ నుంచి భారీగా కాలుష్య నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. రొయ్యల ప్రోసెస్ ద్వారా వచ్చే కాలుష్య వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా బయటకు విడుదల చేస్తున్నారు. ఫ్యాక్టరీల కాలుష్యంపై పీసీబీకి దొంగ లెక్కలతో మాయ చేస్తున్నారు. అనుమతి లేకుండా లోపల ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. గ్రీన్ బెల్ట్ లేకుండా ఉన్నట్లు మాయ చేసి చూపారు. వీటి ఉల్లంఘనలను అధికారులు తనిఖీల్లో గుర్తించి ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
కాగా కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన రెండో రొయ్యలశుద్ధి కంపెనీలో భారీ ఉల్లంఘనలు బయటపడ్డాయి. ప్రత్తిపాడు మండలం లంపకలోవలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో అడుగడుగునా కాలుష్య నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) గుర్తించింది. వీటిని సరిదిద్దుకునేందుకు మూడు నెలలు గడువిచ్చినా అతీగతీ లేదు. దీంతో అధికారులు ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
పూర్తి వివరాలు
జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడికి కాకినాడ జిల్లాలో రెండు చోట్ల వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ పేరుతో రొయ్యల కంపెనీలున్నాయి. వీటిలో ఒకటి కాకినాడ సమీపంలోని కరప మండలం గురజనాపల్లిలో ఉంది. దీనిలో భారీగా కాలుష్య నిబంధనలను ఉల్లంఘించారని తేలడంతో ఇటీవల దానిని పీసీబీ సీజ్ చేసింది. ప్రత్తిపాడు మండలం లంపకలోవలోని మరో కంపెనీలోనూ భారీ కాలుష్య ఉల్లంఘనలను అధికారులు జూలై 11న గుర్తించారు. కంపెనీ రియల్‌టైం పొల్యూషన్ తెలిపే ఆర్‌టీపీఎంస్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. సూయేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా వ్యర్థజలాలను నేరుగా బయట పంట కాలువల్లోకి వదిలేస్తోంది. ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఈటీపీ) లాగ్‌బుక్‌ను జూలైలో తనిఖీ చేయగా కంపెనీ రోజుకు వాడాల్సిన 2,059 యూనిట్ల విద్యుత్‌లో 200 నుంచి 400 యూనిట్ల వరకు తేడాగా ఉందని, దీనికి కారణం ఈటీపీ వ్యవస్థను వాడకపోవడమేనని తేల్చారు. లోపల 20టీపీడీ సామర్థ్యంతో కూడిన ఐస్‌ప్లాంట్‌ను అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వ్యర్థజలాలను బయటకు విడుదల చేసే పైపులైన్ పలుచోట్ల దెబ్బతింది. కంపెనీ విడుదల చేస్తున్న ఏడు రకాల వ్యర్థజలాలను పరిశీలించగా.. పీసీబీ ప్రమాణాలకు లోబడి శుద్ధి చేయడం లేదని తేలింది.
రొయ్యల శుద్ధిలో భాగంగా వచ్చే వ్యర్థాలను డిస్పోజ్ కంపెనీకి ఇవ్వాల్సి ఉండగా చాలా తక్కువ అప్పగించారని, మిగిలినదాన్ని అనధికారికంగా బయటకు పంపేస్తున్నారని వెల్లడైంది. ఈ లోపాలపై వివరణ కోరుతూ ఆగస్టు 8న నోటీసు జారీచేశారు. వీటికి కంపెనీ బదులిస్తూ.. రియల్‌టైం పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్ (ఆర్‌టీపీఎంఎ్‌స)ను అందుబాటులోకి తెచ్చి.. త్వరలో పీసీబీ సర్వర్‌కు కనెక్ట్ చేస్తామని.. ఇందుకు నవంబరు వరకు గడువివ్వాలని కోరింది. సూయేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుకూ మూడు నెలల వ్యవధి అడిగింది. వ్యర్థ జలాలను మూడురోజులపాటు నిల్వ చేసేలా స్టోరేజ్ ట్యాంకు నిర్మిస్తామన్నారు. నవంబరు నెల ముగుస్తున్నా... వీటిలో ఏ ఒక్కటీ కంపెనీ సరిద్దిలేదు. ఈనెల 21న పీసీబీ కమిటీ ఫ్యాక్టరీకి వచ్చి ఈ విషయాన్ని నిర్ధారించుకుంది. గడువులోగా లోపాలను సరిదిద్దని నేపథ్యంలో ప్లాంట్‌ను సీజ్ చేస్తూ పీసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా మళ్లీ గడువివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గురజనాపల్లి ప్లాంట్‌ను ఇదే కారణాలతో సీజ్ చేసిన అధికారులు.. దానికంటే పెద్దదైన లంపకలోవ ఫ్యాక్టరీ విషయంలో మౌనం దాల్చడం చూస్తే తెరవెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News